Nithiin: నితిన్‌ – వెంకీ సినిమా స్టార్ట్‌ అవ్వాలంటే ఆయన రావాల్సిందే!

VNR ట్రయో… అంటూ ఆ మధ్య ఓ వీడియో రిలీజ్‌ చేసి మరీ సినిమాను అనౌన్స్‌ చేసింది టీమ్‌. అది కూడా మామూలు వీడియో కాదు, సెల్ఫ్‌ ట్రోల్‌ వీడియో. అంటే తమను తామే కౌంటర్‌ చేసుకుంటూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు. మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. అందులో దర్శకుడు వెంకీ కుడుముల గురించి చెప్పినప్పుడు డిస్కస్‌ చేసిన పాయింట్‌ గుర్తుందా? కొత్త సినిమా కోసం వెంకీ చాలా టైమ్‌ తీసుకున్నాడు అని. ఎన్నో నెలల తర్వాత సినిమా చేస్తున్నాడు అని.

అవును, ఓకే కానీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు అనుకుంటున్నారా? అంత సెల్ఫ్‌ ట్రోల్‌ చేసుకుని మరీ సినిమా అనౌన్స్‌ చేసిన టీమ్‌ ఆ సినిమాను ప్రారంభించడానికి మళ్లీ టైమ్‌ తీసుకుంటోంది. అంతా ఓకే త్వరలో సినిమా అని అప్పుడు చెప్పి.. ఇంతవరకు స్టార్ట్‌ ఎందుకు చేయలేదు అని అనుకుంటున్నారు. అయితే దీనికి టీమ్‌ నుండి ఓ ఆసక్తికరమైన సమాధానం వచ్చింది. అదే మరో హీరో. అవును ఈ సినిమాలో ఇంకో హీరోకు ఛాన్స్‌ ఉందట. ఆ పాత్రకు నటుడిని ఫైనల్‌ చేయడం కోసమే సినిమా లేట్‌ అట.

వెంకీ మనసులో, కథలో ఉన్న పాత్రకు అగ్ర హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. దీని కోసం టాలీవుడ్‌లో ఒకరిద్దరిని ట్రై చేశారట. అయితే ఎంతకీ ఓకే అవ్వకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్‌ వైపు చూస్తున్నారని అంటున్నారు. అక్కడ కూడా కాకపోతే సౌత్‌ ఇండస్ట్రీలవైపు చూస్తారు అంటున్నారు. అయితే ఇప్పుడున్న ట్రెండ్‌లో బాలీవుడ్‌ స్టార్‌ మన సినిమా ఒప్పుకోవడం సులభమే. కాబట్టి త్వరలోనే ఓకే చేసేసి సినిమా షురూ చేస్తారు అని చెబుతున్నారు.

చిరంజీవి – డీవీవీ దానయ్య కాంబినేషన్‌లో వెంకీ కుడుమల ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే సెకండాఫ్‌ విషయంలో ఇబ్బంది వచ్చి ఆగిపోయింది. దీంతో (Nithiin) నితిన్‌ – రష్మిక మందనతో ఈ సినిమా చేస్తున్నారు. ‘భీష్మ’ తర్వాత ఈ ముగ్గురూ కలసి చేస్తుండటంతో వీఎన్‌ఆర్‌ ట్రయో అని నిక్‌ నేమ్‌ పెట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతుంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus