సినిమా పోస్టర్ చూసి, టీజర్లు – ట్రైలర్లు చూసి కథలు చెప్పేసే రోజులు గతంలో చూశాం. అయితే ఇటీవల కాలంలో ఇలాంటివి తగ్గాయి. కారణం… ఏదో ఒక ట్విస్ట్ వచ్చి అనుకున్నదంతా మారిపోతోంది. అయితే కొన్ని సినిమాల విషయంలో అనుకున్నది అనుకున్నట్లు అవుతున్నాయి. అలా ఓ కొత్త సినిమాకు సంబంధించి ‘కథ ఇదే’ అంటూ ఓ చర్చ మొదలైంది. అది కూడా స్టార్ హీరో సినిమా కావడంతో గతంలో ఇలాంటి కథ ఏమైనా వచ్చిందా అనే ఎంక్వైరీ కూడా మొదలైంది.
వెంకటేశ్ ప్రస్తుతం 74 సినిమాలు పూర్తి చేసుకొని మైల్ స్టోన్ అయిన 75వ సినిమా విడుదలకు సిద్ధం చేశారు. అదే ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రచారం షురూ చేశారు కూడా. సినిమా పాటను ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య ప్రాంతాల్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ చర్చ మొదలైంది.
సోషల్ మీడియా చర్చల ప్రకారం చూస్తే.. గోపీచంద్ గతంలో చేసిన ఓ ప్రయోగాత్మక చిత్రానికి దగ్గరగా ఉంది అని చెబుతున్నారు. పాపను బ్రతికించుకోవడానికి అవసరమైన ఒక ఇంజెక్షన్ చుట్టూ ‘సైంధవ్’ సినిమా కథ తిరుగుతుందని టాక్. ఆ ఇంజిక్షన్ ధర రూ.15 కోట్లకు పై మాటే అంటున్నారు. దీని గురించే హీరోకు, విలన్‌కు మధ్య వార్ జరుగుతుందట. ఇదంతా వింటుంటే గోపిచంద్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ‘ఒక్కడున్నాడు’ కథకు దగ్గరగా ఉన్నట్లు అనిపించకమానదు.
ఆ సినిమాలో (Saindhav) బాంబే బ్లడ్ కోసం హీరోని చంపడానికి విలన్ మహేష్ మంజ్రేకర్ ముఠా వెంటపడుతుంది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా అనిపించినా… సెకండాఫ్‌లో కన్‌ఫ్యూజ్, బోరింగ్ లాంటివి వచ్చి ఫలితం తేడా కొట్టింది. దీంతో అలాంటి కథతోనే ఇప్పుడు శైలేష్ తీస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. సినిమా కథను కనెక్టింగ్‌గా తీస్తే ఈసారి మంచి ఫలితం రావొచ్చు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!