తెలుగు సినిమా థియేటర్లు బతకాలి, తెలుగు సినిమా బతకాలి అంటూ ఇటీవల మన నిర్మాతల కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సినిమాల్ని ఓటీటీలకు ఇవ్వడానికి సుమారు పది వారాల గ్యాప్ తీసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ గ్యాప్ మంచిదేనా? 50 – 70 రోజుల తర్వాత సినిమా ఓటీటీలోకి వస్తే జనాలు చూస్తారా, అసలు అన్ని రోజుల తర్వాత అంటే ఓటీటీ సంస్థలు కొనడానికి ముందుకొస్తాయా? ఇప్పుడు ఇదే చర్చ.
కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీలు చాలా ఉపయోగపడ్డాయి. ప్రేక్షకులకు వినోదం ఇస్తూ, నిర్మాతలకు డబ్బులు ఇస్తూ నష్టపోకుండా చూశాయి. అయితే థియేటర్ రిలీజ్– ఓటీటీ రిలీజ్‌కి మధ్య గ్యాప్ తగ్గిపోవడంతో జనాలు ఓటీటీలకే జై కొట్టడం మొదలెట్టారు. థియేటర్‌లో సినిమా ఆడుతున్నా ‘రెండు వారాలకు ఇంట్లో చూసుకుందాంలే’ అనుకున్నారు. దీంతో థియేటర్లు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. దీంతో ఆగస్టు 1వ నుండి షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు అనుకుంటున్నారట.
ఇప్పటివరకు 45 రోజుల దాకా సినిమా ఓటీటీలో విడుదల చేయకూడదని నియమం పెట్టుకున్న నిర్మాతలు ఆ సమయాన్ని 70 రోజులకు పెంచాలని అనుకుంటున్నారట. హిట్ సినిమా అయితే అన్ని రోజుల తర్వాత ఓటీటీకి వస్తే జనాలు చూడటానికి ఇష్టపడతారు. ఓటీటీలు కూడా కొనడానికి ముందుకొస్తాయి. అలా కాకుండా సినిమా ఫ్లాప్ అయితే 70 రోజుల వరకు ఆగాలంటే ఇబ్బందే. ఆ మాత్రం డబ్బులు కూడా రావు. ఈ 70 రోజుల కాన్సెప్ట్ అన్ని సినిమాలకు వర్కవుట్ కాదు అని అర్థం దీంతో అర్థమవుతుంది.
ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి, మరికొన్ని పరిశ్రమ సమస్యల గురించి మాట్లాడటానికితెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నెల 23న సమావేఅం ఏర్పాటు చేస్తోంది. మరి ఆ రోజు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని రెండు రకాల కాన్సెప్ట్ ఎంచుకుంటారో, లేక అన్నింటికీ ఒకే మంత్రంలా ఇన్ని రోజులు అని ఓ లెక్కేస్తారో చూడాలి.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!