మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( ‘మా’) ఎన్నికల వల్ల టాలీవుడ్ సెలబ్రిటీలు నాలుగు గ్రూపులుగా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో ఎవరు విన్ అవుతారో ఎవరు ఓటమిపాలవుతారో కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిగిన ‘మా’ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది మరింత రసవత్తరంగా ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. ఈసారి ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీ చేస్తుండగా రాబోయే రోజుల్లో పోటీ చేసేవాళ్ల సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనే చెప్పాలి.
అయితే స్టార్ హీరోలు మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను పట్టించుకోకపోవడం గమనార్హం. ‘మా’లో 950 మంది సభ్యులున్నా వీళ్లంతా ఓటింగ్ లో కచ్చితంగా పాల్గొంటారని చెప్పే పరిస్థితి అయితే లేదు. స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. కరోనా భయం వల్ల కొందరు సెలబ్రిటీలు ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. పోటీ చేస్తున్న సెలబ్రిటీలకు పలువురు స్టార్ హీరోలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నా ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. సీనియర్ స్టార్ హీరోలు కూడా ప్రత్యక్షంగా సెలబ్రిటీలకు మద్దతు ఇవ్వడం లేదు.
ఫండ్ రైజింగ్ ఈవెంట్ల సమయంలో, విపత్తుల సమయంలో విరాళాలు ఇచ్చే హీరోలు నడిగర్ సంఘం ఎన్నికలలో కోలీవుడ్ హీరోలు బాధ్యత తీసుకున్న విధంగా ‘మా’ ఎన్నికల బాధ్యతను తీసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్ హీరోలను చూసి టాలీవుడ్ హీరోలు మారతారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!