‘టెంపర్’ ను మించే హిట్టు కొట్టావ్ పూరి?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. గత కొంత కాలంగా సరైన హిట్టు లేక సో.. సో సినిమాలతో లాగించేస్తున్న రామ్,పూరి లు ఎంతో కసిగా ఈ చిత్రాన్ని చేసారు. మొదటి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రామ్ కెరీర్లో మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం. తెలంగాణ యాసతో.. రామ్ ను ఊర మాస్ గా చూపించాడు పూరి. దీంతో మాస్ సెంటర్స్ లో ఈ చిత్రం ఇరక్కొట్టేస్తుంది. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.23 కోట్లు
సీడెడ్ – 1.20 కోట్లు
వైజాగ్ – 0.86 కోట్లు


ఈస్ట్ – 0.50 కోట్లు
కృష్ణా – 0.53 కోట్లు
గుంటూరు – 0.57 కోట్లు


వెస్ట్ – 0.40 కోట్లు
నెల్లూరు – 0.30 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 7.59 కోట్లు


రెస్ట్ అఫ్ ఇండియా – 0.40 కోట్లు
ఓవర్సీస్ – 0.30 కోట్లు
——————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 8.29 కోట్లు(షేర్)
——————————————————-

‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 17 కోట్లకు జరిగింది. మొదటి రోజే ఈ చిత్రానికి 8.29 కోట్ల షేర్ వచ్చింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. ఎలాగూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కాబట్టి… వీకెండ్ పూర్తయ్యే సరికి 90% డిస్ట్రిబ్యూటర్లకు రికవరీ అయిపోయే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ‘టెంపర్’ తర్వాత హిట్టు లేదని బాధ పడిన పూరి.. ఆ చిత్రాన్ని మించే హిట్టు కొట్టాడని చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus