NBK107: బాలయ్యకు ఐటెమ్‌ గాళ్‌గా ఆసీస్‌ అమ్మాయి..!

మాస్‌ కమర్షియల్‌ మూవీకి హీరో, హీరోయిన్‌ ఎంత ముఖ్యమో, ఐటెమ్‌ గాళ్ కూడా అంతే ముఖ్యం. అందుకే మన దర్శక నిర్మాతలు సినిమా స్టార్ట్‌ అనుకున్నప్పుడే ఐటెమ్‌ సాంగ్‌ కోసం హీరోయిన్‌ ఎవరు అని వెతికేస్తున్నారు. అలా బాలయ్య – గోపీచంద్‌ మలినేని సినిమాకు కూడా ఎప్పటి నుండో ‘ఐటెమ్‌’ చర్చలు జరుగుతున్నాయి. బయట ఫ్యాన్స్‌లో కూడా అవే చర్చలు కంటిన్యూ. అయితే వీటికి ఇక చెప్పేయొచ్చు. ఎందుకంటే ఆ ఐటెమ్‌ గాళ్‌ ఎవరో తెలిసిపోయింది.

గోపీచంద్‌ మలినేని సినిమాలో బాలయ్య డబుల్‌ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్‌ బాలయ్య, కాస్త ఏజ్‌ బాలయ్య ఉండనున్నారు. దీనికి సంబంధించి లుక్‌లు కూడా బయటికొచ్చాయి. ఏజ్‌ బాలయ్య లుక్‌ లీక్‌ అయ్యి, ఆ తర్వాత అఫీషియల్‌ రిలీజ్‌ కూడా అయ్యింది. ఇప్పుడు యంగ్‌ బాలయ్య లుక్‌ను తమన్‌ బయటపెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి ఐటెమ్‌ సాంగ్‌ రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారు. అక్కడ బాలయ్య, దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌తో సెల్ఫీ దిగి అప్‌లోడ్‌ చేశారు తమన్‌.

ఈ పాటలో బాలయ్య సరసన డ్యాన్స్‌ వేసేది డింపుల్‌ హయాతి అని తొలుత అనుకున్నారు. ఈ మేరకు ఈ వార్త వైరల్‌గా మారింది కూడా. అయితే ఇందులో డ్యాన్స్‌ వేస్తోంది ఆమె కాదట. ఆస్ట్రేలియాకు చెందిన భారతీయ సంతతి అమ్మాయి చంద్రికా రవి. గతంలో తెలుగులో ఓ సినిమాలో నటించిన చంద్రిక రవి ఇప్పుడు బాలయ్య సరసన ఐటెమ్‌గాళ్‌గా కనిపించనుంది. ఈ మేరకు సెట్‌లో మేకప్‌ వేస్తున్న ఫొటో షేర్‌ చేసి #NBK107 అని రాసుకొచ్చింది చంద్రిక రవి.

భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రికా రవి. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యింది. మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తెలుగులో ‘చీకటి గదిలో చితకొట్టుడు’ సినిమా చేసింది. ఇప్పుడు బాలకృష్ణతో స్పెషల్ సాంగ్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాఓల బాలయ్య సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus