సినిమా రిలీజ్‌లు చూశాం.. చాలానే చూశాం. ఇప్పుడు వాటి రీ రిలీజ్‌లు చూస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు అనే విషయం పక్కనపెడితే.. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు రీ రిలీజ్‌లు అవుతున్నాయి. అయితే అవన్నీ హీరోల నేపథ్యంలో జరుగుతున్నవే. అంటే హీరోల పుట్టిన రోజు సంద్భంగానే ఆ సినిమాలను రీ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు తొలిసారి ఓ దర్శకుడి కోసం సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ దర్శకుడు త్రివిక్రమ్ అయితే.. ఆ సినిమా ‘నువ్వే నువ్వే’.
తెలుగు సినిమా అభిమానులకు ‘నువ్వే నువ్వే’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకుడిగా తొలి అడుగు వేసింది ఆ సినిమాతోనే. తరుణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఆ సినిమా ఆ రోజుల్లో అదిరిపోయే హిట్ అయ్యింది. కామెడీ, ఫాదర్ – డాటర్ బాండింగ్, డిఫరెంట్ అప్రోచ్ ఉన్న లవ్ స్టోరీ.. ఇలా చాలా రకాల కొత్త ఫీలింగ్స్ అందులో కనిపిస్తాయి. ఆ సినిమా ఇటీవల 20 ఏళ్ల మైలురాయిని దాటింది కూడా. ఇప్పుడు ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
అయితే సినిమా వచ్చి 20 ఏళ్లు అయినందుకు కాదు. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పని చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ‘మా దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచన మేరకు ‘నువ్వే నువ్వే’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాం’ అంటూ అనౌన్స్ చేసింది చిత్రబృందం. నవంబరు 7న త్రివిక్రమ్ జన్మదినం సందర్భంగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రీ రిలీజ్‌ల ట్రెండ్ మొదలుపెట్టిన క్రెడిట్ మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాకే దక్కుతుంది. దాన్ని ఆ తర్వాత పీక్స్‌కు తీసుకెళ్లిన ఘనత పవన్ కల్యాణ్ ‘జల్సా’ది. దానికి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా. అయితే ఇవన్నీ హీరోల నేపథ్యంలో సాగినవే. ఇప్పుడు ‘నువ్వే నువ్వే’ దర్శకుడి బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. మరి దీని తర్వాత ఇంకా ఏయే సినిమాలు ఈ లైన్‌లో వస్తాయో చూడాలి.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!