Sreeleela: థియేటర్, ఓటీటీ, యూట్యూబ్, టీవీ అన్నిట్లోనూ లీలమ్మే

కెరీర్ మొదలుపెట్టాక “ధమాకా (Dhamaka), భగవంత్ కేసరి” (Bhagavanth Kesari) తప్ప మరో హిట్టు లేదు. అందులోనూ “భగవంత్ కేసరి”లో హీరోయిన్ కాదు. అయితే.. శ్రీలీల (Sreeleela) క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 2023లో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఇక బోలెడు ఆశలు పెట్టుకున్న “గుంటూరు కారం” (Guntur Kaaram) ఏమో డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత అమ్మడ్ తెలివిగా గ్యాప్ తీసుకుంది. కానీ.. ఆమె చేసిన రెండు సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాని, జనాల్ని ఊపేశాయి.

Sreeleela

ముఖ్యంగా.. “గుంటూరు కారం” సినిమాలోని “కుర్చీ మడతపెట్టి” ఇంటర్నేషనల్ లెవల్లో హిట్ అవ్వగా.. రీసెంట్ గా వచ్చిన “పుష్ప 2” (Pushpa 2: The Rule)  లో “కిసిక్” అనే పాటతో రచ్చ చేస్తోంది. అయితే.. ఈ ఏడాది ఎక్కడ చూసినా శ్రీలీల కనిపిస్తోంది. “పుష్ప 2”తో థియేటర్లలో, ది రానా దగ్గుబాటి (Rana Daggubati) షో పుణ్యమా అని అమెజాన్ ప్రైమ్ లో, బాలయ్య (Nandamuri Balakrishna) “అన్స్టాపబుల్” షో ద్వారా ఆహా యాప్ లో, ఇక రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా శ్రీలీల దర్శనం ఇస్తోంది.

డిసెంబర్ 25న “రాబిన్ హుడ్”తో ప్రేక్షకుల్ని పూర్తిస్థాయి హీరోయిన్ గా మరోసారి పలకరించనుంది. ఈ సినిమా హిట్టవ్వడం ఆమెకి చాలా ముఖ్యం. వచ్చే ఏడాది తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో ఎంట్రీ ఇవ్వనున్న శ్రీలీల తెలుగులోనూ మూడునాలుగు రిలీజులతో సిద్ధంగా ఉంది. సో, 2025లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో శ్రీలీలను చూస్తామన్నమాట. ఇకపోతే.. కెరీర్ మొదల్తో కథ కంటే కాంబినేషన్ & రెమ్యునరేషన్ కి ఎక్కువ ఇంపార్టెస్ ఇస్తూ వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయిన శ్రీలీల, ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

ముఖ్యంగా.. తన పాత్ర విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుందట. మరీముఖ్యంగా తనకు పొలోమని డ్యాన్స్ సీన్స్ పెట్టొద్దని, తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేయమని దర్శకులను రిక్వెస్ట్ చేస్తోందట. మరి శ్రీలీల కాస్త గ్యాప్ తీసుకుని ఇస్తున్న ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఆమెకు ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

అస్సలు పడను అంటున్న రష్మిక మందన్న!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus