తెలుగు ప్రేక్షకులకి ’96’ రీమేక్ నచ్చలేదా?

  • February 12, 2020 / 01:17 PM IST

తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ చిత్రం రైట్స్ ను .. ఏరి కోరి తీసుకున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. తెలుగులో ‘జాను’ పేరుతో ఒరిజినల్ రూపొందించిన దర్శకుడు ప్రేమ్ కుమారే డైరెక్ట్ చేసాడు. అయితే ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కరెక్ట్ కాదని అప్పట్లో చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే ఒరిజినల్ లో త్రిష, విజయ్ సేతుపతి చేసిన పాత్రలకి ఇక్కడ శర్వానంద్, సమంత లను తీసుకోవడంతో పర్వాలేదులే అనుకున్నారు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూలు .. రేటింగ్ లు.. వచ్చాయి. నూటికి నూరు శాతం సమంత, శర్వానంద్ లు.. వారి నటనలతో ఆకట్టుకున్నారు.. ’96 రీమేక్’ కు న్యాయం చేశారు అనే కామెంట్స్ వినిపించాయి.

కానీ ఈ సినిమా టేకింగ్ చాలా స్లోగా ఉంటుంది.. కచ్చితంగా ఇందులో మాస్ అప్పీల్ ఉండదు. దీని ప్రభావం కలెక్షన్స్ పై పడింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీకెండ్ వరకూ ఈ చిత్రం పర్వాలేదనిపించింది. కానీ సోమవారం నుండీ పరిస్థితి చాలా ఘోరంగా తయారయ్యింది. ఈ చిత్రానికి యావరేజ్ కలెక్షన్లు కూడా రావడం లేదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్లకు అమ్మకాలు జరిగాయట. ఇప్పటికీ 7 నుండీ 7.5 కోట్ల మధ్యలో షేర్ వచ్చిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. సమంత సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ ఉంది. అయితే ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ కూడా రాకపోతుండడం ట్రేడ్ కు సైతం షాకిస్తుంది. ఫిబ్రవరి సినిమాలకి డ్రై సీజన్ అంటారు. అలాగే శర్వానంద్ కూడా ఈ మధ్య ఫామ్లో లేదు. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ వంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. వాటి ఎఫెక్ట్ ఈ చిత్రం కలెక్షన్ల పై పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి భారీ నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus