‘ఎగసిపడే కెరటాలు నువ్వు.. ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్ల మబ్బులా… ఓర చూపుకోసం, నీ దోర నవ్వుకోసం.. రాత్రంతా చుక్కలెక్కపెడుతూనే ఉంది నా హృదయం.. నా వైపు ఓ చూపు అప్పియ్యలేవా’ అనే కవిత్వంతో ‘జాను’ ట్రైలర్ మొదలైంది. చిన్నప్పుడు స్కోల్లో ప్రేమించుకుని విడిపోయిన.. ఇద్దరి ప్రేమికుల కథ ఇదని తెలుస్తుంది. మళ్ళీ ఓ ‘గెట్ టు గెథర్’ లో కలుసుకున్న ఈ జంట చివరికి కలుసుకున్నారా విడిపోయారా? అనేది మిగిలిన కథని తెలుస్తుంది. తమిలలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ’96’ అనే బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ గా తీశారు.
నిజానికి ’96’ సినిమా చూసిన వాళ్ళకి ఈ చిత్రం కథ ఏమీ కొత్తగా అనిపించదు. ఒరిజినల్ తీసిన ప్రేమ్ కుమారే ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసాడు. దిల్ రాజు నిమిస్తున్న ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మహేంద్రన్ జయరాజ్ పనితనం అని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇక రెండో అట్రాక్షన్ శర్వానంద్, సమంత అని చెప్పొచ్చు. మరీ విజయ్ సేతుపతి, త్రిష లను మ్యాచ్ చేయకపోయినా.. ఈ పెయిర్ మాత్రం ఫ్రెష్ గా కనిపిస్తుంది.
’10 నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే’ అనే డైలాగ్ ప్రతీ ఒక్కరి హృదయాన్ని తాకుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గోవింద వసంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. తెలుగు ప్రేక్షకులకి అందులోనూ ’96’ ఒరిజినల్ చూడని వాళ్ళకి.. ‘జాను’ ట్రైలర్ కొంచెం రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ చిత్రం ఛాయలను గుర్తుచేస్తుంది. ఏమైనా శర్వా, సమంతలు మాత్రం ఈ రీమేక్ కు న్యాయం చేసేలానే ఉన్నారు. ఫిబ్రవరి 7 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈలోపు ట్రైలర్ ను ఓ లుక్కెయ్యండి.