ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన మూడో తరం.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే రమేష్ బాబు కొడుకు జయకృష్ణ డెబ్యూ ప్రాజెక్టు ఖరారైంది. ‘మంగళవారం’ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకముందే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుండి మరొకరు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ మనవరాలు, మహేష్ బాబు మేనకోడలు, మంజుల ఘట్టమనేని కుమార్తె అయినటువంటి జాన్వీ స్వరూప్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆల్రెడీ కథ లాక్ అయ్యింది.
దర్శకుడు, నిర్మాణ సంస్థ కూడా లాక్ అవ్వడం జరిగింది. కానీ వాటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ జాన్వీ డెబ్యూని అధికారికంగా ఖరారు చేశారు ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో.. ఇటీవల ఆమె పాల్గొన్న ఒక ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు కొన్ని పీఆర్..ల ద్వారా వదిలారు. వీటిలో జాన్వీ స్వరూప్ చాలా అందంగా కనిపిస్తుంది. పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనడంలో డౌట్ లేదు. మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుని.. నటనతో మెప్పిస్తే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

ఇక జాన్వీ తల్లి మంజుల కూడా నటిగా మెప్పించిన సంగతి తెలిసిందే. ‘షో’ ‘ఆరెంజ్’ ‘కావ్యాస్ డైరీ’ ‘సేవకుడు’ ‘మళ్ళీ మొదలైంది’ ‘హంట్’ ‘మంత్ ఆఫ్ మధు’ వంటి సినిమాల్లో నటించింది. అలాగే ‘పోకిరి’ ‘ఏమాయ చేసావె’ వంటి సినిమాలు కూడా నిర్మించారు మంజుల. ఇక జాన్వీ తండ్రి సంజయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
