ఆ స్టార్ హీరోలు సైతం ఆర్పీ చేపల పులుసు రుచి చూశారట.. ఏమైందంటే?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని తర్వాత రోజుల్లో ఈ షోకు దూరమైన కమెడియన్లలో కిర్రాక్ ఆర్పీ ఒకరు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా ఆర్పీ ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. యూట్యూబ్ వీడియోల ద్వారా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. ఖరీదు కొంచెం ఎక్కువగా ఉన్నా చాలామంది ఈ కర్రీ పాయింట్ లో చేపల పులుసు టేస్ట్ చేయడానికి ఎగబడ్డారు.

హైదరాబాద్ లోని వేర్వేరు ప్రాంతాలలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ లు ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం ఇతర జిల్లాలకు కూడా ఈ కర్రీ పాయింట్ ఫ్రాంఛైజీలు ఇస్తున్నారు. తాజాగా ఆర్పీ ఒక సందర్భంలో మాట్లాడుతూ బాలయ్య ఇంటికి సైతం తన చేపల పులుసు వెళ్లిందని చెప్పుకొచ్చారు. బాలయ్య మనుషులు కొంతమంది మాదాపూర్ బ్రాంచ్ నుంచి చేపల పులుసు కొనుగోలు చేశారని ఆర్పీ పేర్కొన్నారు.

నా చేపల పులుసు రుచికరంగా ఉండటం వల్లే వాళ్లు వచ్చి చేపల పులుసును తీసుకెళ్లారని ఆర్పీ వెల్లడించారు. చిరంజీవి, ప్రభాస్ లకు కూడా నా చేపల పులుసును పంపించానని ఆర్పీ అన్నారు, ఆర్పీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది. ఈ వ్యాపారం ద్వారా ఆర్పీకి లక్షల్లో ఆదాయం వస్తోందని సమాచారం. కిర్రాక్ ఆర్పీకి సెలబ్రిటీల సపోర్ట్ ఉండటం గమనార్హం.

ఆర్పీ భవిష్యత్తులో కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్లు ఆర్పీ వ్యాపారాలకు తమ వంతు సహాయం చేస్తున్నారు. అనంతపూర్ తో పాటు వైజాగ్, బెంగళూరులలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ లు ఓపెన్ అయ్యాయి. ఆర్పీ ఈ మధ్య కాలంలో వివాదాలకు సైతం దూరంగా ఉంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus