Ganapathi: సర్కారు బడిలో టీచర్ గా మారిన జబర్దస్త్ కమెడియన్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది టీం లో కమెడియన్ గా సందడి చేస్తున్న గణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హైపర్ ఆది స్కిట్ లో తనకు భార్య పాత్రలలో కూడా నటించి మెప్పించిన గణపతి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఈయన కూడా ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన గణపతి (Ganapathi) ఇతర చానల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలలో సందడి చేసేవారు అయితే ప్రస్తుతం ఈయన బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారని తెలుస్తుంది. ఒకప్పుడు వేదికపై తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించిన గణపతి ప్రస్తుతం పిల్లలను క్రమశిక్షణ పెట్టే పనిలో పడ్డారు. ఇలా కమెడియన్ గా అందరిని నవ్వించిన గణపతి ఒక్కసారిగా బడిపంతులుగా మారిపోయారు.

ఈయన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందినవారు అయితే తాజాగా ఈయన ఇదే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా జాయిన్ అయ్యి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. ఇలా కమెడియన్ గా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగ టీచర్ అవడం ఏంటి అనే విషయానికి వస్తే…1998వ సంవత్సరంలో డీఎస్సీ అభ్యర్థులకు ఇప్పటివరకు పోస్టింగ్ ఇవ్వలేదని విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడంతో ఈయనకి కూడా టీచర్ ఉద్యోగం వచ్చిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన శ్రీకాకుళం జిల్లాలో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇలా సర్కారు పాఠశాలలో చదువు చెప్పాలనేది తన 25 సంవత్సరాల కల అని ఆ కల ఇప్పటికి నెరవేరింది అంటూ ఈయన సంతోషం వ్యక్తం చేశారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus