Kevvu Kartheek: కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కెవ్వు కార్తీక్ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. గత కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భార్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ ఫోటోలలో ఎక్కడా కూడా ఈయన అమ్మాయి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

తాజాగా మరోసారి కెవ్వు కార్తీక్ (Kevvu Kartheek) తనకు కాబోయే భార్య ఫేస్ రివిల్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా ఆ అమ్మాయి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా ఒక రొమాంటిక్ కొటేషన్ కూడా షేర్ చేశారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే ఏమిటో తెలిసేది కాదు. అది ఇప్పుడు అర్థమవుతుంది. ఫైనల్లీ ఆమె ఈమెనే. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు లవ్ యు సిరి అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు.

ఈ విధంగా కెవ్వు ఆర్థిక తనకు కాబోయే భార్య ఫేస్ రివిల్ చేస్తూ తన పేరు సిరి అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కామెంట్లు చేయగా మరి కొందరు ముందుగానే కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లో చేస్తున్నారు. ప్రస్తుతం కెవ్వు కార్తీక్ తనకు కాబోయే భార్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కెవ్వు కార్తీక్ తన కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు ఈయన ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే మరోవైపు మిమిక్రీలో డిప్లమా చేశాడు. అనంతరం ఎంటెక్ కూడా పూర్తిచేసి ఉద్యోగంలో స్థిరపడినటువంటి కెవ్వు కార్తీక్ మిమిక్రీ కామెడీ పై ఉన్న ఫ్యాషన్ తో ఉద్యోగానికి రాజీనామా చేసి అవకాశాల కోసం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ఈయన అవకాశం అందుకొని ప్రస్తుతం సెలబ్రిటీగా కొనసాగుతున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus