సినీ పరిశ్రమలో వరుస మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, ఫ్యాషన్ డిజైనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. గత 3 నెలల్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించారు.సెప్టెంబర్ 11న ప్రభాస్ పెదనాన్న గారు అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడంతో ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ పడింది. అలాగే రష్మీ జయ గోపాల్,
కమెడియన్ రాజు శ్రీవాస్తవ్, బెలూన్ ఆర్టిస్ట్ కమ్ నటుడు అయిన శరవణ ధన్‌పాల్, అలాగే అశోకన్ అలియాస్ రామన్ అశోక్ కుమార్ అనే మరో దర్శకుడు మృతి చెందారు. తాజాగా మరో జబర్దస్త్ కమెడియన్ మరణించడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది. ‘జబర్దస్త్’ వల్ల పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలా మంది ఉన్నారు. అందులో మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి కూడా ఒకరు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన ..
ఇప్పుడు పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచారు. ఇతని సోదరుడు అరుణ్. మూర్తి మరణవార్తని ధృవీకరించారు. ‘జబర్దస్త్’ లో మూర్తి చాలా స్కిట్ లలో తన మార్క్ కామెడీతో అలరించాడు. అలాగే అద్భుతంగా మిమిక్రీ చేసి నవ్వులు పూయించేవాడు. క్యాన్సర్ కు సరైన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇతని వద్ద తగిన డబ్బు లేదట. అందుకే మెరుగైన వైద్యం అందలేదని తెలుస్తుంది. ఇతని మరణ వార్తకు చింతిస్తూ కొందరు జబర్దస్త్ కమెడియన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!