మరోసారి అనారోగ్యానికి గురైన జబర్దస్త్ పంచ్ ప్రసాద్.. ఈయన పరిస్థితి చూస్తే కన్నీలాగావు!

బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా తన కామెడీతో అందరిని నవ్విస్తూ ఎంతో సందడి చేసే కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి అందరికీ సుపరిచితమే. ఇలా తన కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగులు వేస్తూ అందరినీ ఎంతో సందడి చేస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ కిడ్నీల అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే గతంలో ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జబర్దస్త్ జడ్జిలుగా ఉన్నటువంటి నాగబాబు రోజా ఇతర కమెడియన్స్ ఈయనకు ఆర్థిక సహాయం చేసి సర్జరీ చేయించారు.

ఈ విధంగా సర్జరీ అనంతరం కోలుకున్నటువంటి పంచ్ ప్రసాద్ తన ఆరోగ్యం పై తానే పంచులు వేసుకుంటూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేసేవారు. ఈ విధంగా జబర్దస్త్ ద్వారా అందరిని సందడి చేస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరోసారి క్షీణించిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్స్ నూకరాజు ఆసియా ఇద్దరు కూడా పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ క్రమంలోనే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరోసారి క్షీణించిపోయిందని ప్రతిరోజు ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

ఇలా ఒక వైపు కిడ్నీల సమస్యతో బాధపడుతుండగా మరోవైపు ఆయన కాలు చచ్చబడిపోయిందని తద్వారా నడవడానికి కూడా వీలు కాలేకపోయింది. ఇలా ఉన్నఫలంగా ఈయనకు మోకాళ్ళ నొప్పి రావడం, నడవలేని పరిస్థితికి వెళ్లడంతో ఆయన భార్య పిల్లలు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్ ఇలాంటి స్థితిలో దీన స్థితిలో ఉన్నారని

తెలియడంతో ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి కొందరు ఆయనకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఆయన క్షేమంగా తిరిగి కోలుకొని ఎప్పటిలాగే జబర్దస్త్ కార్యక్రమంలో అందరిని నవ్వించాలని ఆకాంక్షిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus