ఆ కమెడియన్ చనిపోయారంటూ ప్రచారం.. ఆగ్రహం వ్యక్తం చేసిన కమెడియన్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఈయన వర్షతో కలిసి ఎన్నో రకాల స్కిట్లు చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా కమెడియన్ గా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు పలు సినిమాలో సిరీస్ లలో కూడా అవకాశాలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్ ప్రేమ వాలంటీర్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించారు.

ఇదిలా ఉండగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి ఛానల్ వ్యూస్ కోసం ఎన్నో రకాల థంబ్ నెయిల్స్ పెడుతూ వార్తలను ప్రచారం చేస్తుంటారు ఈ క్రమంలోనే ఇమ్మాన్యుయేల్ చనిపోయారు అంటూ థంబ్ నెయిల్ పెట్టడమే కాకుండా పక్కన వర్ష ఏడుస్తూ కూర్చున్నటువంటి ఫోటో ద్వారా ఈ వార్తను పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఇలా ఈయన చనిపోయారనే విషయం వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు కంగారు వ్యక్తం చేశారు.

తాజాగా ఈ వార్తలపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్ (Emmanuel) స్పందిస్తూ తాను చనిపోలేదని బ్రతికే ఉన్నాను అంటూ చెప్పుకు వచ్చారు. తాను ప్రేమ వాలంటీర్ అనే సిరీస్ లో క్లైమాక్స్ లో చనిపోయినట్టు చూపించారు. నేను సిరీస్ లో చనిపోయినట్టు నటిస్తే నిజంగానే నన్ను చంపేశారు అంటూ ఈయన సదరు యూట్యూబ్ ఛానల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మనిషి బ్రతికి ఉండగానే ఆయన చనిపోయారు అంటూ ఇలాంటి పిచ్చి వార్తల కారణంగా వారు ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలని తెలిపారు.

కేవలం మీ ఛానల్ వ్యూస్ కోసం ఇలాంటి అర్థంలేని వార్తలను ప్రచారం చేయడం సరి కాదని ఈయన యూట్యూబ్ ఛానల్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇలా బ్రతుకున్న వారిని యూట్యూబ్ ఛానల్ చంపేయడం ఇది మొదటిసారి కాదు. ఇదివరకు ఎంతో మంది సీనియర్ సెలబ్రిటీలను కూడా చనిపోయినట్టు వార్తలు ప్రచారం చేయగా చివరికి వారికి కూడా మేము బ్రతికే ఉన్నామని మా గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదు అంటూ చెప్పుకోవాల్సిన దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus