Chiranjeevi: చిరంజీవి స్వయంగా రికమండ్ చేయడం ఆనందంగా ఉంది: పొట్టి నరేష్

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ ప్రస్తుతం వెండితెరపై కూడా బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అద్భుతమైన కామెడీ టైమింగ్, తన స్కిట్లతో అందరిని నవ్విస్తూ సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కమెడియన్స్ ను స్వయంగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం విశేషం.ఇప్పటికే ఎంతోమంది వెండితెరపై సందడి చేయగా తాజాగా పొట్టి నరేష్ కు సైతం వెండితెర అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి. నరేష్ చూడటానికి పొట్టిగా ఉన్న తన కామెడీ స్కిట్ లతో ప్రతి ఒక్కరిని సందడి చేస్తుంటారు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న పొట్టి నరేష్ ఏకంగా మెగాస్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. మెగాస్టార్ నటిస్తున్నటువంటి భోళా శంకర్ సినిమాలో ఈయనకు అవకాశం వచ్చినట్లు స్వయంగా నరేష్ తెలిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవికి పెద్ద అభిమానిని , ఇలా అభిమాన హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ సినిమాలో నటించడం కోసం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నా పేరును రికమండ్ చేయడం చాలా ఆనందంగా ఉందని నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అంటూ నరేష్ వెల్లడించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నానని మెగాస్టార్ తో కలిసి ఇలా వెండి తెరను పంచుకోవడం తన అదృష్టమని నరేష్ తెలిపారు. ఇక ప్రస్తుతం తాను ఈ పొజిషన్ లో ఉండటానికి జబర్దస్త్ టీమ్ ఎంతో సహాయం చేశారని నరేష్ వెల్లడించారు.

ఇకపోతే తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ…ఎప్పటికైనా తనకంటూ ఒక సొంత కారు ఇల్లు ఉండాలన్నది తన కోరిక అని ప్రస్తుతం సొంత కారు ఉంది, త్వరలోనే ఇల్లు కూడా కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇల్లు కొన్న తర్వాత పెళ్లి చేసుకుంటానని నరేష్ తెలిపారు. ఇక నేను కనుక పెళ్లి చేసుకుంటే అదొక వింత అవుతుందని, ఇంట్లో అయితే తనకు పెళ్లి చేసుకోవాలని ఎలాంటి ఒత్తిడి లేదు అంటూ ఈ సందర్భంగా పొట్టి నరేష్ తన కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus