Jabardasth Pavithra: వాలంటైన్స్ డే రోజున బ్రేకప్ చెప్పిన పవిత్ర.. ఏమైందంటే

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న పవిత్రకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తన యాక్టింగ్ స్కిల్స్ తో పవిత్ర ఎంతోమంది అభిమానులకు దగ్గరయ్యారు. అయితే వాలెంటైన్స్ డే రోజున ఈ బ్యూటీ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పవిత్ర అధికారికంగా బ్రేకప్ చెప్పడం గమనార్హం. సంతోష్ అనే వ్యక్తిని లవ్ చేసిన పవిత్ర గతంలో ఉంగరాలు కూడా మార్చుకున్నారు. త్వరలో పెళ్లికి సంబంధించిన తీపికబురును ఈ జోడీ చెబుతుందని అందరూ భావించగా ఊహించని విధంగా బ్రేకప్ చెప్పి ఆశ్చర్యపరిచారు.

గత రెండు సంవత్సరాలుగా పవిత్ర, సంతోష్ ప్రేమలో ఉన్నారు. కొన్ని రీజన్స్ వల్ల విడిపోతున్నామని పవిత్ర, సంతోష్ వెల్లడించడం గమనార్హం. మా మార్గాలు వేరైనా మేము పంచుకున్న క్షణాలు ప్రత్యేకమని ఆమె అన్నారు. లైఫ్ లో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని పవిత్ర చెప్పుకొచ్చారు. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నామని ఆమె వెల్లడించారు.

మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని ధన్యవాదాలు అని పవిత్ర కామెంట్లు చేయడం గమనార్హం. చిన్నచిన్న మనస్పర్ధల వల్లే ఈ జోడీ విడిపోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పవిత్ర సంతోష్ మళ్లీ కలవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

జబర్దస్త్ పవిత్ర (Jabardasth Pavithra) గతాన్ని మరిచిపోయి కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పవిత్ర కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. పవిత్ర ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కు 1500కు పైగా లైక్స్ వచ్చాయి. పవిత్రకు ఇన్ స్టాగ్రామ్ లో 1,82,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. పవిత్రకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus