Rithu Chowdhary: సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన జబర్దస్త్ బ్యూటీ.. అసలు మ్యాటర్ ఏంటంటే?

రీతూ చౌదరి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర సీరియల్స్ లోను అలాగే బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కూడా లేడి కమెడియన్ గా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తరచూ తన ప్రేమ బ్రేకప్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో అందరిని చాలా కన్ఫ్యూజన్ కు గురి చేస్తుంటారు.

ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవడం దండగ అంటూ మాట్లాడారు. బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్అప్ అయిందా అంటే తర్వాత చెబుతా అంటూ దాటవేశారు దీంతో అందరూ కూడా ఈమె బ్రేకప్ చెప్పుకున్నారని భావించగా తన బాయ్ ఫ్రెండ్ తో చాలా చలువుగా ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అందరికీ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నటువంటి ఈమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియా వేదికగా హల్దీ వేడుకకు సంబంధించిన వీడియోని ఈమె షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఏంటి రీతూ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా ఈమె షేర్ చేసినటువంటి ఈ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజమైన పెళ్లి అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్టే.

ఇలా పెళ్లి వీడియోని షేర్ చేసినటువంటి ఈమె అనంతరం ఆన్ స్క్రీన్ పెళ్లిళ్లు చాలా క్రేజీగా ఉంటాయి అంటూ క్యాప్షన్ పెట్టడంతో ఈ పెళ్లి తంతు కార్యక్రమం షూటింగ్లో భాగంగా జరిగినదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఇలా ఈ పెళ్లి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది. దీంతో పలువురు ఈమె షేర్ చేసిన ఈ వీడియో పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus