సాధారణంగా చాలా మందికి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఆరాటపడుతుంటారు. ఈ విధంగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలామంది ఎన్నో కష్టాలు పడటమే కాకుండా మరికొందరు బంధాలను బాంధవ్యాలను వదులుకొని ఇండస్ట్రీలోకి వస్తారు. అయితే తనకంటూ ఒక గుర్తింపు ఉండటం కోసం ఏకంగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని జబర్దస్త్ కార్యక్రమంలోకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. సాదాసీదా ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ అతి తక్కువ సమయంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని చివరికి టీమ్ లీడర్ గా ఎదిగారు.
ఈ విధంగా జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ మిమిక్రీ లో గోల్డ్ మెడల్ అందుకున్న వెంకీ పలు ఉద్యోగాలు చేస్తూ చివరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అయితే తనకు నటన పై ఉన్న ఆశక్తితో తనకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.
గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కేవలం మా ఊరి ప్రజలకు మాత్రమే తెలుసు. అలా కాకుండా నా కంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విధంగా నేను అనుకున్నది జబర్దస్త్ కార్యక్రమం ద్వారా నిజమైంది. జబర్దస్త్ కార్యక్రమంలో 14 ఎపిసోడ్ ల నా మిమిక్రీ షో ని చూసిన తర్వాత చంద్రన్న తనని పిలిపించి తనకు అవకాశం కల్పించారు. ఇలా ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం చంద్రన్న అంటూ ఆయన తెలిపారు. చంద్రన్న టీంలో దాదాపు 30 ఎపిసోడ్ వరుకు చేశానని వెంకీ వెల్లడించారు.
ముఖ్యంగా లేడీస్ గెటప్స్ తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయని వెంకీ తెలిపారు. లేడీ గెటప్స్ చేయాలంటే సులువైన విషయం కాదని చీరలు కట్టుకోవడం, విగ్గులు పెట్టుకోవడం, హెవీ మేకప్ ఇలా లేడీ గెటప్స్ లో నటించాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఆడవాళ్ళు ఎంత కష్ట పడతారో జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ వేసినప్పుడు అర్థమైందని వెంకీ వెల్లడించారు. ఈ విధంగా తాను చంద్ర రాఘవ వేణు అన్న టీంలో ఎన్నో స్కిట్లు చేశానని తెలిపారు. ఆ తర్వాత నాకు జబర్దస్త్ కార్యక్రమంలో ప్రత్యేకంగా టీం ఏర్పడి టీం లీడర్ గా అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా వెంకీ తెలియజేశారు.