టాలీవుడ్‌లో నాగార్జునను మన్మథుడు అని అంటారు.. జగపతిబాబును ఫ్యామిలీ మ్యాన్ అంటారు. ఇద్దరి పేర్లు డిఫరెంట్‌గా కనిపించినా.. ఇద్దరూ మహా చిలిపి అనే విషయం తెలిసిందే. ఎవరికి వారు తమదైన టాలెంట్‌తో ప్రేక్షకుల్ని, ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నారు. జగపతిబాబు మధ్యలో ట్రాక్ నుండి బయటకు వచ్చి విలన్ అయిపోయారు కానీ.. ఇంకా ఆయనలో ఆ చిలిపితనం అలానే ఉంది. దీనికి ఓ ఉదాహరణ ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కొత్త సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ షో తొలి ఎపిసోడ్‌కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
ఈ షో ప్రోమో ఇటీవల విడుదలైంది. నా స్నేహితుడంటూ నాగార్జునను జగపతిబాబు షోలోకి ఆహ్వానించారు. ఆ ‘ఏం దాచుకోకుండా మాట్లాడుకునే షో ఇది’ అని హోస్ట్ జగపతి బాబు చెప్పగా.. ఓకే అంటూ నవ్వేశాడు నాగ్. అలా మొదలైన సందడిలోకి ఆ తర్వాత నాగార్జున సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగసుశీల రావడంతో ఇంకాస్త సందడిగా మారింది. ‘మన్మథుడు’ అనే టాపిక్‌ను వెంకట్ దగ్గర ప్రస్తావిస్తే.. ‘నీ తర్వాతే’ అని అన్నారాయన. దానికి జగపతిబాబు అవన్నీ ఇప్పుడు కాదు అనడం హైలైట్.
ఇక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆఫ్ ది ప్రోమో.. బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు? గురించి చూస్తే.. ‘రమ్యకృష్ణ, టబులో నీ బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు?’ అని నాగార్జునను జగపతి అడగ్గా ‘కొన్ని చెప్పకూడదు.. నేను చెప్పను’ అని అన్నారు నాగార్జున. ఆ వెంటనే ‘రమ్యకృష్ణ, సౌందర్యలో నీకు ఇష్టమైన నటి ఎవరు?’ అని జగపతిని నాగార్జున అడగ్గా.. ఇది నా ఇంటర్వ్యూ కాదు.. నేను సమాధానం చెప్పను అంటూ నవ్వేశారాయన. దీంతో ఈ ఇంటర్వ్యూ ఆసక్తికరంగా సాగుతుంది అని అర్థమవుతోంది.
ఇక ‘కూలీ’ సినిమాలోని ఓ డైలాగ్‌ను ఈ షోలో నాగార్జున చెప్పడం కొసమెరుపు. ‘ఒకడు పుట్టగానే ఎవడి చేతిలో చనిపోతాడు అనేది వాడి తల మీద రాసి పెట్టి ఉంటుంది’ అంటూ తన పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పుకొచ్చారు నాగ్.