హీరో నుంచి విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతి బాబు జీవితం ఆధారంగా త్వరలోనే ఓ వెబ్ సిరీస్ రూపొందనుంది. జగపతిబాబు తండ్రి రాజేంద్రప్రసాద్ కెరీర్ ప్రారంభం నుంచి ఈ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. చిన్నప్పటి జగపతిబాబు పాత్ర పోషించే నటుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ ఎవరు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేనప్పటికీ.. నెట్ ఫ్లిక్స్ లేదా అమేజాన్ లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు కూడా నటిస్తాడు. మొత్తం 25 ఎపిసోడ్ లుగా ఈ సిరీస్ ఉంటుంది.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి..త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటిస్తారు.
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, నటుడిగా, మంచి భర్తగా, తండ్రిగా అన్నీ పాత్రల్లోనూ తనదైన శైలిలో విజయాన్నందుకొన్న జగపతిబాబు కెరీర్ కొత్తలో నిర్మాత కొడుకు అవ్వడం వలన అవకాశాలు బాగానే వచ్చినా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. తీరా హీరోగా సెటిల్ అయ్యాక అవకాశాలు తగ్గాయి, విడుదలైన సినిమాలన్నీ పరాజయం పాలవ్వడం మొదలైంది. దాంతో.. హీరో నుంచి విలన్ గా మారాడు జగపతిబాబు. మధ్యలో బోలెడన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేశాడు కూడా. ఇన్ని వైవిధ్యాలు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జగపతిబాబు బయోగ్రఫీ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకొని తీరుతుంది.