Jagapathi Babu: వారసులు లేరనే బాధ నాన్నకు ఉండేది: జగపతి బాబు

సినీ నటుడు జగపతిబాబు ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన తన వృత్తిపరమైనటువంటి విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ సందడి చేస్తున్నారు. ఇక జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వారసుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జగపతి బాబుకి ఇద్దరు కుమార్తెలు అనే విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ నుంచి ఈయనకు ఒక ప్రశ్న ఎదురైంది ఎప్పుడైనా కూతుర్లు మాత్రమే ఉన్నారు.

కొడుకు కనక ఉండి ఉంటే తను కూడా సినిమాలలోకి వెళ్లేవారు కదా అని ఆలోచన రాలేదా మీకు అంటూ ప్రశ్నించడంతో ఎప్పుడూ కూడా తాను అలాంటి ఆలోచన చేయలేదని జగపతిబాబు తెలిపారు. ప్రస్తుతం కూతురులైన కొడుకులైనా ఒకటేనని ఈయన తెలిపారు. ఇక ఎంతోమంది అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అయితే తన కుమార్తెలకు హీరోయిన్స్ గా రావడం ఇష్టం లేదని సినిమాలంటే ఆసక్తి లేకపోవడంతోనే వాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని జగపతిబాబు తెలిపారు. అయితే వారసులు లేరు అనే బాధ మా నాన్నగారికి ఎక్కువగా ఉండేదని ఈయన తెలిపారు. నాకు మాత్రమే కాకుండా మా అన్నయ్యలకు కూడా మగ పిల్లలు లేరు దాంతో వారసులు లేరనే బాధ ఆయనలో ఎక్కువగా ఉండేది

ఆయన బాధ చూసి ఒక రోజు తాను మరి ఎవరినైనా తెచ్చుకుందామా అంటూ కూడా నాన్నను అడిగానని ఈ సందర్భంగా జగపతిబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జగపతిబాబు (Jagapathi Babu) ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus