సీనియర్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం అవసరమైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నారు. ఈయన ఏ విషయం పై అయినా ముక్కు సూటిగా మాట్లాడుతారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన లైఫ్ అండ్ డెత్ గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జగపతిబాబు మాట్లాడుతూ…”జీవితంలో చివరి పదేళ్లు చాలా విలువైనవని నేను భావిస్తాను. ఆ టైమ్ లో తృప్తి వలన సంతోషం ..
సంతోషం వలన ఆరోగ్యం లభిస్తాయని నేను (Jagapathi Babu) నమ్ముతాను. మనసుకు .. శరీరానికి శిక్షణ చాలా అవసరం. సరైన శిక్షణ ముందు నుంచి ఇస్తూ వెళ్లినప్పుడే, ఆ రెండూ నీ మాట వింటాయి అని అనుకుంటాను. ఒంటరి తనాన్ని తట్టుకుని నిలబడి ఉంటేనే అవి శక్తిని ఇస్తాయి అని కూడా.ఇక చాలామంది దెయ్యాలు గురించి చెబుతూ భయం అని అంటారు. నాకూ.. మొదటి నుండి నాకు దెయ్యాలు అంటే భయం. అవి ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు.
అలాగే ఇరుకైన ప్రదేశాలు అంటే కూడా భయమే. అలాంటి చోట్లకి నేను వెళ్లను. ఇక చనిపోయిన తరువాత ఏం జరుగుతుందనే ఆలోచన కూడా నాకు భయాన్నే కలిగిస్తుంది. చనిపోయాక లైఫ్ ఇంతకంటే బెటర్ గా ఉంటుందా? బాధగా ఉంటుందా? అసలు అప్పుడు ఆనందాలు .. బాధలు తెలుస్తాయా? అనేది ఇప్పటికీ నాకు సస్పెన్స్ గా అనిపిస్తాయి” అంటూ చెప్పుకొచ్చారు. అవి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!