సీనియర్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలలో విలన్ పాత్రలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు రాజా మన్నార్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన పాత్ర గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ప్రశాంత్ ని కలిసినప్పుడు మీ సినిమాలలో తప్పకుండా నటించాలని ఆయనతో చెప్పేవారని అందుకే ఫోన్ చేసి మరి ఈ సినిమా గురించి చెప్పి ఇందులో నా పాత్ర గురించి తెలియజేశారు.
ఈ సినిమాలో.. ఖాన్సార్ అనే కోటను మనిషిలా భావించడమనే కాన్సెప్ట్ నన్ను ఆకట్టుకుంది. అయితే, ఖాన్సార్ గురించి తొలిసారి విన్నప్పుడు అతడెవరు ఈ సినిమాలో నాకన్నా పెద్ద విలన్ ఉన్నారా అన్న సందేహాలు నాకు కలిగాయి. ఇక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత ఖాన్సార్‌కు నేనే రాజునని తెలిసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. అలాగే ఈ సినిమా హీరో ప్రభాస్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..
హీరో ప్రభాస్ మంచితనం గురించి ఇదివరకు పలు సందర్భాలలో జగపతిబాబు వెల్లడించారు. అయితే తాజాగా ప్రభాస్ ఎంతో మంచి నటుడిని ఆయనకు ఇతరులకు ఇవ్వడం తప్ప ఇతరుల నుంచి ఏది తీసుకోవడం తెలియదు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కూడా తెలిపారు.
ఇక ఈ సినిమాలో మలయాళీ నటుడు పృధ్విరాజ్ సుకుమార్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈయన జగపతిబాబు కుమారుడి పాత్రలో నటించారు. ఇక ఈయన కూడా ఎంతో అద్భుతమైన నటుడు అంటూ జగపతిబాబు ప్రశంసలు కురిపించారు. ఇక సలార్ పార్ట్ 2లో నా పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ ఈ సందర్భంగా (Jagapathi Babu) జగపతిబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!