‘మహేష్ 26’ నుండీ తప్పుకున్న జగపతి బాబు.. కారణం?
- July 16, 2019 / 02:01 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26 వ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యే మొదలైంది. అయితే ఈ చిత్రం కోసం మంచి క్యాస్టింగ్ ను ఎంచుకున్నాడు అనిల్ రావిపూడి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకరైతే.. ఫ్యామిలీ హీరోగా క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న జగపతి బాబు ఒకడు. ఆయనే ఈ చిత్రంలో విలన్ అని టాక్ నడిచింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం నుండీ ఆయన తప్పుకున్నట్టు తాజా సమాచారం.

స్క్రిప్ట్ రెడీ అవుతున్న సమయంలోనే దర్శకుడు అనిల్ రావిపూడి.. జగపతి బాబుని సెలెక్ట్ చేసుకున్నాడు. విజయశాంతి, జగపతి బాబు మధ్య వచ్చే సీన్లు ఓ రేంజ్లో ఉండబోతున్నాయని కూడా టాక్ రావడంతో అందరితోనే ఆసక్తి పెరిగింది. కానీ ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ తగిలినట్టే అని చెప్పాలి. ఇప్పుడు ఆయన స్థానంలో ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారట. అసలు జగపతి బాబు ఎందుకు తప్పుకోవడానికి కారణాలేంటనేది మాత్రం బయటకి రాలేదు. ‘మహర్షి’ చిత్రంలో జగపతి బాబు నటించినా… సక్సెస్ మీట్లకి మాత్రం ఆయన రాలేదు. ఇప్పుడు ఏకంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండీ అయన తప్పుకోవడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు చిత్రాలకి జగపతి బాబుతో కామన్ గా ఉన్నది మహేష్, దిల్ రాజు. వీరిమధ్యనే ఏమైనా మనస్పర్థలు ఏర్పడ్డాయా..? అనేదే ప్రస్తుతం ఫిలింనగర్లో చర్చనీయాంశం అయ్యింది.
















