Jagapathi Babu: జగపతి బాబుకి ఆయన తల్లి జయలక్ష్మి గురించి ఏం చెప్పారంటే..

చదువుల సరస్వతికి పేదరికం అడ్డు కాకూడదని ప్రముఖ నటుడు జగపతి బాబు ఆమెకు అండగా నిలబడ్డారు.. సాధారణంగా తాను చేసిన సాయాల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడని జగ్గు భాయ్.. తనకి ఎదుటి వాళ్లకి ఇవ్వడం అంటే ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు.. సైదాబాద్‌కు చెందిన జయలక్ష్మి వరల్డ్‌ చిల్ట్రన్స్‌ పార్లమెంట్‌ ప్రధానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె డిగ్రీ చదువుతూనే పలు రకాల సామాజిక సమస్యలపై పోరాటం చేస్తోంది.

గతంలో తనకు బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ నుంచి ‘డే ఆఫ్‌ ది గర్ల్‌ ఛాలెంజ్‌ రన్నరప్‌ – 2021’ పురష్కారం వచ్చింది. దాంతోపాటు ఛేంజ్‌ మేకర్‌ అనే అవార్డు కూడా రావడం విశేషం.. జయలక్ష్మి సివిల్స్ కోసం చాలా కష్టపడుతోంది.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు.. తన తల్లిదండ్రులు ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తుంటారు.. వారికి పూట గడవడమే కష్టం.. అలాంటిది ఇక కూతుర్ని ఉన్నత చదువులు ఎలా చదివించగలరు..

అందుకే జయలక్ష్మి సాయం కోసం ఎదురు చూస్తోంది.. అంటూ జయలక్ష్మి సాధించిన విజయాలపై ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో ఓ ఆర్టికల్ వచ్చింది.. ఈ కథనాన్ని జగపతి బాబు తల్లి చదివారు.. జయలక్ష్మి సాధించిన విజయాల గురించి చదివి ముచ్చట పడ్డారు.. ఈ విషయాన్ని కొడుక్కి చెప్పి.. ఎలాగైనా ఆ అమ్మాయికి సహాయం చేయాలని.. తనకెంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు.. తల్లి అంతలా చెప్తే ఆయన మాత్రం ఎందుకు కాదంటారు..

పైగా చదువుల సరస్వతికి సాయం.. వెంటనే ఓకే అమ్మా అంటూ మాటిచ్చారు.. జయలక్ష్మిని పిలిపించి మాట్లాడారు. సివిల్స్‌ శిక్షణ కోసం అవసరమైన ఆర్థిక సాయం చేస్తానని, ఇంకా బాగా కష్టపడి చదివి అనుకున్నది సాధించి.. మరింత మందికి ఆదర్శంగా నిలబడే స్థాయికి ఎదగాలని బ్లెస్ చేశారు.. తన చదువు కోసం సాయం చేయడానికి ముందుకొచ్చిన జగపతి బాబు మరియు ఆయన తల్లికి కృతజ్ఞతలు తెలిపింది జయలక్ష్మి..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus