Jagapathi Babu: కూతుర్ల విషయంలో జగపతిబాబు అలాంటి నిర్ణయం తీసుకున్నారా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వరుస సినిమాలలో విలన్ పాత్రలలోను సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జగపతిబాబు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి జగపతిబాబు తన కూతుర్ల కెరియర్ గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈయన తన పెద్ద కుమార్తెకు అమెరికాకు చెందినటువంటి అబ్బాయితో పెళ్లి చేసి పంపించారు. ఇక చిన్న కూతురు పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా తనకు అసలు పెళ్లి చేసుకోవద్దని నేను సలహా ఇచ్చాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టారు. ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి పెద్దగా ప్రాధాన్యత లేదని పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని విడిపోతున్నారని అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం దేనికి పెళ్లి లేకుండా హ్యాపీగా బ్రతికేయమని తన కూతురికి నా అభిప్రాయాన్ని చెప్పాను.

ఇక పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం తన ఇష్టమని (Jagapathi Babu) జగపతిబాబు వెల్లడించారు. ఒకవేళ తన చిన్న కూతురు పెళ్లి చేసుకుంటే కనుక తనే తనుకు నచ్చిన వాడిని వెతుక్కోవాలని ఈయన తెలిపారు. ఇక తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి పంపించాను కానీ తను మాత్రం ఒక రోజు నాతో నాన్న మేము పిల్లలు వద్దనుకుంటున్నాము అంటూ వారి అభిప్రాయాన్ని తెలుపగా నేను కూడా మీ ఇష్టం అంటూ చెప్పేశానని జగపతిబాబు చెప్పడంతో వెంటనే యాంకర్ కూతుర్ల కెరియర్లో ఇలాంటి అభిప్రాయాలు తీసుకోవడం ఏంటి అంటూ ప్రశ్నించగా

ఈయన నేను వారికి పెళ్లిళ్లు చేసి నా బాధ్యతను ముగించుకోలేను వారికి నచ్చిన విధంగా వారు ఉండాలనే స్వేచ్ఛ కల్పిస్తున్నానని తెలిపారు.అయితే మీ కూతుర్ల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే మీరు ఇక తాతయ్య కాలేరా అంటూ యాంకర్ అడగగా నేను తాత అయినా చేసేదేమీ లేదు కదా అంటూ ఈయన చెప్పిన సమాధానం వైరల్ గా మారింది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus