మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న “నేల టికెట్” సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులోమాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్‌ఆర్‌టీ మూవీస్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు రాజకీయనాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇది హీరోకి సమానమైన రోల్ అని తెలిసింది. ఇద్దరి నటన పోటాపోటీగా ఉండనుందని సమాచారం. రవితేజ, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయని చిత్ర బృందం తెలిపింది.
ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా ఇప్పుడే కొనుగోలుచేశారు. ఈ రెండు హక్కుల కోసం సన్ టీవీ వాళ్ళు 25 కోట్లు చెల్లించినట్లు నిర్మాత మీడియాతో వెల్లడించారు. శాటిలైట్ హక్కులే ఇంత ధర పలికితే థియేటర్ రైట్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాని త్వరలో కంప్లీట్ చేసి శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్నారు. “అమర్ అక్బర్ ఆంటోనీ” కోసం అమెరికాకు వెళ్లనున్నారు. అక్కడే నెలపాటు జరిగే భారీ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.