Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Reviews » Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 5, 2025 / 01:05 PM ISTByDheeraj Babu
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Thug Life Review in Telugu: థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కమల్ హాసన్ (Hero)
  • త్రిష కృష్ణన్,అభిరామి (Heroine)
  • సిలంబరసన్,ఐశ్వర్య లక్ష్మి,అశోక్ సెల్వన్,జోజు జార్జ్,నాజర్, (Cast)
  • మణిరత్నం (Director)
  • కమల్ హాసన్ ,ఆర్. మహేంద్రన్, మణిరత్నం ,శివ అనంత్ ,ఉదయనిధి స్టాలిన్ (Producer)
  • ఎ. ఆర్. రెహమాన్ (Music)
  • రవి కె. చంద్రన్ (Cinematography)
  • Release Date : June 5, 2025
  • రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిమ్స్ , మద్రాస్‌ టాకీస్‌ రెడ్ జెయింట్ మూవీస్ (Banner)

లెజండరీ ఫిలిం మేకర్ మణిరత్నం (Mani Ratnam), లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ ల (Kamal Haasan) క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం “థగ్ లైఫ్” (Thug Life ). ఈ సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. ఎనౌన్స్ మెంట్ టీజర్ కే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక రెహమాన్ పాటలు, మణిరత్నం మార్క్ ఫ్రేమ్స్ తో విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంది, ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

Thug Life Review

Thug Life Movie Review and Rating

కథ: నెల్లూరు నుంచి ముంబై వెళ్లి సెటిలైన గ్యాంగ్ స్టర్ శక్తిరాజు (కమల్ హాసన్) ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. చిన్నప్పుడు శక్తిరాజుకి కవచంగా మారి కాపాడిన అమర్ (శింబు)ని (Silambarasan) తమ్ముడిగా చూసుకుంటూ.. అతడ్ని కుడి భుజంగా దందా కొనసాగిస్తుంటాడు.

ఈ క్రమంలో శక్తిరాజుపై అనుకోని విధంగా అటాక్ అవుతుంది. ఆ అటాక్ వెనుక తనవాళ్లు ఉన్నారేమో అని అనుమానిస్తాడు శక్తిరాజు. దాంతో అంతర్యుద్ధం మొదలవుతుంది.

ఆ అంతర్యుద్ధం ఎలాంటి తీవ్రమైన పరిస్థితులకు దారి తీసింది? అనేది “థగ్ లైఫ్” (Thug Life ) కథాంశం.

Thug Life Movie Review and Rating

నటీనటుల పనితీరు: కమల్ హాసన్, శింబు, త్రిష (Trisha), అశోక్ సెల్వన్ (Ashok Selvan), ఐశ్వర్య రాజేష్, నాజర్ (Nassar), జోజు జార్జ్ (Joju George) వంటి మహామహులందరూ ఉన్న ఈ చిత్రంలో తన నటనతో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్న నటి అభిరామి (Abhirami). సెకండాఫ్ లో ఆమె పాత్రను అనవసరంగా వృథా చేశారు కానీ.. ఫస్టాఫ్ లో కనిపించే కాసిన్ని సన్నివేశాల్లో కూడా ఆమె కళ్లల్లో పండించిన భావం చాలా నిక్కచ్చిగా ఉంది. ముఖ్యంగా వంటగది సన్నివేశంలో ఆమె కళ్లల్లో కనిపించిన కోపం, బాధ వంటి ఎమోషన్స్ చాలా రిలేటబుల్ గా ఉంటాయి.

ఇక కమల్ మొదలుకొని జోజు జార్జ్ వరకు ప్రతి ఒక్కరూ ఈ తరహా పాత్రల్లో పలుమార్లు మెప్పించినవారే. కమల్ వర్సెస్ శింబు సీన్స్ ఇంకొన్ని ఉంటే బాగుండు అనిపించింది.

త్రిష కెరీర్ బెస్ట్ లుక్స్ ఈ సినిమాలోనే అని చెప్పాలి. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. ఆమె లుక్స్ & కమల్ తో కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంటాయి.

అలీ ఫజాల్ (Ali Fazal), మహేష్ మంజ్రేకర్ (Mahesh Manjrekar) తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Thug Life Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: మొదటి 10 నిమిషాల సినిమాలో పాత్రధారులకు చేసిన డీ-ఏజింగ్ ఎఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ముఖ్యంగా కమల్ హాసన్ ను చూస్తే “నాయకుడు” రోజులు గుర్తురావడం ఖాయం. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో వాడిన డీ-ఏజింగ్ ఎఫెక్ట్స్ లో ఇది ది బెస్ట్ అని చెప్పాలి.

రవి కె.చంద్రన్ (Ravi K. Chandran) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. మణిరత్నం మార్క్ ఫ్రేమ్స్ పుష్కలంగా కనిపించాయి. ముఖ్యంగా.. హాస్పిటల్ సీన్ లో అశోక్ సెల్వన్ మెట్లు దిగుతూ.. శింబు మెట్లు ఎక్కేప్పుడు పెట్టిన షాట్ భలే ఉంది. అలాగే.. యాక్షన్ బ్లాక్ విషయంలో కూడా మంచి కేర్ తీసుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ (Akkineni Sreekar Prasad) ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్ లో ఎక్కడా డూప్ దొరక్కుండా ఆయన కొన్ని ఫ్రేమ్స్ ను స్పీడప్ చేసిన విధానం మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.

రెహమాన్ (A.R.Rahman) సంగీతం ఎందుకో పూర్తిస్థాయి సంతృప్తినివ్వలేకపోయింది. పాటలు వినసొంపుగా ఉన్నా.. అవన్నీ సినిమాలో బిట్ సాంగ్స్ లా మాత్రమే వినిపించడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఎక్కువగా వినిపించిన “అచ్చె వన్నె పూవా” అనే పాట మరీ రిపీటెడ్ గా వినిపించడం అనేది రుచించలేదు.

ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లే కమల్ హాసన్ రెడీ చేసిందని, “అమర్ హై” అనే కమల్ రాసుకున్న కథలోని ఓ చిన్న పాయింట్ ను తీసుకొని మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని కమల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

అందువల్ల మణిరత్నంకి పూర్తిస్థాయి ఫ్రీడమ్ దొరకలేదేమో అనిపించింది. సినిమా మొదలైన 15 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంచి వరల్డ్ బిల్డింగ్ ఉంటుంది. అక్కడక్కడా మణిరత్నం “నవాబ్” పోలికలు కనిపించినా.. బాగుంది అనిపిస్తుంది. కానీ.. పాత్రలను నడిపించిన విధానం ఫస్టాఫ్ ను కాస్త దెబ్బతీయగా.. ఆ పాత్రల క్యారెక్టర్ ఆర్క్ ను డ్రైవ్ చేసిన తీరు సెకండాఫ్ కు మైనస్ గా మారింది. మణిరత్నం నుంచి రెగ్యులర్ & రొటీన్ డ్రామాలు అస్సలు కోరుకోం, అందుకు కారణం ఆయన సెట్ చేసిన స్టాండర్డ్. ఆయన పండించే డ్రామాలో కూడా మంచి ఎమోషన్ ఉంటుంది. “థగ్ లైఫ్”లో ఆ రెండూ మిస్ అయ్యాయి. అసలే పాత్రలు సరిగా ఆకట్టుకోవడం లేదనే నిరాశకి, రొటీన్ & టెంప్లేట్ స్క్రీన్ ప్లే యాడ్ అవ్వడంతో అలసత్వంతో మిన్నకుండడం తప్ప చేసేదేమీ లేక తెరపై కోకొల్లలుగా కనిపిస్తున్న నటీనటులను చూస్తూ కూర్చుండిపోతాం. మణిరత్నం మార్క్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో మిస్ అవ్వడం అనేది ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.

Thug Life Movie Review and Rating

విశ్లేషణ: “ఏ ఫిల్మ్ బై మణిరత్నం” అనే టైటిల్ పడ్డాక హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది ఆడియన్స్ పట్టించుకోరు. మణిరత్నం మ్యాజిక్ ను ఫీల్ అవ్వాలని మాత్రమే కుర్చీల్లో కూర్చుంటారు. ఆ ఫ్రేమింగ్స్, ఆ సంగీతం, ఆ పాటల చిత్రీకరణ, ఆ డ్రామా కోసం మాత్రమే సినిమా చూస్తుంటారు. థగ్ లైఫ్ లో భారీ క్యాస్టింగ్ & టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ… మణిరత్నం మార్క్ మిస్ అయ్యింది. కమల్ హాసన్ కథలో దమ్ములేకపోగా, కథనాన్ని నడిపించిన విధానంలో కొత్తదనం కొరవడంతో “థగ్ లైఫ్” చతికిలపడింది. కమల్ హాసన్ & మణిరత్నంల హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం 165 నిమిషాల థగ్ జర్నీని ఎంజాయ్ చేయలేరు.

Thug Life Movie Review and Rating

ఫోకస్ పాయింట్: లైఫ్ మిస్సైన థగ్!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhirami
  • #Kamal Haasan
  • #Mani Ratnam
  • #Thug Life
  • #Trisha

Reviews

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara: Chapter 1 Review in Telugu: కాంతార: చాప్టర్ 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Idli Kottu Review in Telugu: ఇడ్లీ కొట్టు సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

trending news

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

‘మటన్ సూప్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ వశిష్ట

3 hours ago
Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

Mohan Babu: మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు

4 hours ago
Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

Idli Kottu Collections: వీక్ డేస్ లో చేతులెత్తేసింది

1 day ago
Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

Kantara Chapter 1 Collections: 5వ రోజు కూడా పర్వాలేదు అనిపించాయి కానీ

1 day ago
OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

OG Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఓజి’

1 day ago

latest news

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

Malla Reddy: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో విలన్ గా మల్లారెడ్డి.. రూ.3 కోట్ల భారీ ఆఫర్.. కానీ?

45 mins ago
SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

SSMB29: మహేష్- రాజమౌళి.. సినిమాకి ఇలాంటి టైటిలా?

1 hour ago
చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

చివరి నిమిషంలో నిర్మాత తప్పుకున్నాడు.. ఉదయ్ కిరణ్ కి మేము ఎటువంటి సహాయం చేయలేకపోయాం : పరుచూరి వెంకటేశ్వరరావు

1 hour ago
Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

Vijay Devarakonda: ఈ మనుషులు నాకు చాలా స్పెషల్‌.. విజయ్‌ దేవరకొండ వీడియో వైరల్‌!

4 hours ago
Darshan: దర్శన్‌  బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

Darshan: దర్శన్‌ బెయిల్‌పై బయటికొచ్చి చేసిన పని ఇదేనా? అందుకే డేట్‌ ఇచ్చారా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version