రజనీకాంత్‌ సినిమాలో జగ్గూ భాయ్‌

సినిమా పరిశ్రమలో కాంబినేషన్‌కి మించిన సెంటిమెంట్‌ లేదు. సరైన కాంబినేషన్‌ కుదిరితే… సినిమా విజయం పక్కా అని అనుకుంటూ ఉంటారు. ఇది హీరో – హీరోయిన్‌ కాంబినేషన్‌ మాత్రమే కాకుండా, యాక్టర్స్‌ కాంబినేషన్‌ కూడా ఉంటుంది. కొన్ని సినిమాల విషయంలో ఇలా జరిగింది కూడా. అయితే సరైన కాంబినేషన్‌ కుదిరినా… కొన్ని సినిమాలు వర్కౌట్‌ కాలేదు. అలాంటి కాంబినేషన్‌లో రజనీకాంత్‌ – జగపతిబాబు ఒకటి. ఇప్పటికే రెండుసార్లు విఫలమైన ఈ కాంబో.. మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో జగపతిబాబును కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ట్వీట్‌ చేసింది. గతంలో జగపతిబాబు తమిళ సినిమాల్లో నటించారు కూడా. అది కూడా రజనీకాంత్‌ సినిమాల్లోనే. ‘కథానాయకుడు’, ‘లింగ’ చిత్రాల్లో జగపతిబాబు నటించారు. ఆ రెండు సినిమాలూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్‌ గతేడాది డిసెంబర్‌లో ‘అన్నాత్తే’ తిరిగి మొదలు పెట్టారు. ఆ తర్వాత రజనీకాంత్‌ అనారోగ్యానికి గురవడంతో చిత్రీకరణ వాయిదా పడింది. ఇటీవల చెన్నైలో తిరిగి షూటింగ్‌ మొదలు పెట్టి, కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. నవంబర్‌ 4, 2021న దీపావళి సందర్భంగా సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus