బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి వసుధార కారులో వెళ్తూ ఏంజెల్ దగ్గర పెళ్లి గురించి మాట్లాడమని చెబుతారు.దాంతో వసుధార నేను ఈ మధ్యనే తనకు పరిచయమయ్యాను మీకైతే తను ఎప్పటి నుంచో తెలుసు తను మీ స్నేహితురాలు మీరే అడగండి సార్ అంటూ వసుధార మాట్లాడుతుంది. నేను ఇలాంటి విషయాలు మాట్లాడనని రిషి చెప్పగా అవును మీరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి పవర్ ఆఫ్ స్టడీస్ గురించి అయితే మాట్లాడేస్తారు అంటూ వసుధార మాట్లాడుతుంది.
అలా మాట్లాడకండి మేడం కొందరికి కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయి.అయినా అవన్నీ అవసరం లేదు మీరు ఏంజెల్ దగ్గర మాట్లాడతారా లేదా చెప్పండి అనడంతో నాకు ఇంట్రెస్ట్ లేదని వసు మాట్లాడుతుంది. ఇదే మీ ఫైనల్ డెసిషనా అంటూ.రిషి అడగడంతో అవును కారు పక్కకు ఆపండి సర్ నేను దిగి వెళ్ళిపోతాను అంటూ వసు చెప్పగా ఎందుకు అని రిషి అడుగుతారు. మీరు ఎలాగో దిగిపొమ్మంటారు కదా అందుకే నేనే ముందుగా దిగిపోతున్నాను అని చెబుతుంది అయినా నేను అలా మధ్యలో వదిలిపెట్టే రకం కాదు నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటూ రిషి తనని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసి వెళ్తారు.
ఇంటికి వెళ్లిన వసుధార ఎంగేజ్మెంట్ ఫోటోలను చూస్తూ ఎమోషనల్ అయ్యి ఆ ఫోటోలను రిషికి పంపిస్తుంది అయితే ఆ ఫోటోలు చూసిన రిషి కోప్పడతాడని చెప్పి వెంటనే డిలీట్ చేస్తుంది ఆ తర్వాత ఏంజల్ కి ఫోన్ చేసి పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది.ఏం ఆలోచించేది వసుధర అబ్బాయిలలో కొన్ని లక్షణాలు బాగుంటే మరికొన్ని లక్షణాలు బాగుండవు అన్ని బాగున్న వాళ్లకి అహంకారమే ఎక్కువ ఇలా అన్ని రకాలుగా బాగుండే వ్యక్తులు ఈ కాలంలో ఎక్కడ దొరుకుతారు చెప్పు అంటూ ఏంజెల్ మాట్లాడుతుంది. అలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు కానీ మనం గమనించమని వసుధార చెప్పడంతో అంతలోపు రిషి అక్కడికి రాగా ఏంజెల్ మై మరిచిపోతుంది.
మరోవైపు మీటింగ్లో ఫణీంద్ర పేపర్లో వచ్చిన న్యూస్ చూసి చాలా కోప్పడతారు. ఇది మన కాలేజ్ గురించి బాగా తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉంటారు అని కోప్పడతారు వారిని అసలు వదిలిపెట్టను తప్పకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వారికి బుద్ధి వచ్చేలా చేస్తానని చెబుతాడు. దీంతో శైలేంద్ర షాక్ అవుతారు. జగతి. మాట్లాడుతూ ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకోవడం అనవసరం వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా దొరుకుతారు కానీ మనం మన కాలేజ్ స్ట్రెంత్ ఎలా పెంచుకోవాలో ఆలోచిద్దాం అంటూ మాట్లాడుతూ ఉంటారు.
అంతలోపే పాండియన్ బ్యాచ్ అక్కడికి వచ్చి వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టు గురించి స్కీం గురించి చెబుతారు. దాంతో జగతి చాలా సంతోషపడుతుంది. మీకు ఎంతమంది స్టూడెంట్స్ కావాలో చెబితే అంత మందిని ప్రొవైడ్ చేస్తామంటూ పాండియన్ చెబుతారు. ఆ దేవుడే మిమ్మల్ని పంపించారని ఆనందపడుతుంది జగతి. తరువాత నేను వీళ్ళని పంపించేసి వస్తాను బావగారు అంటూ వారితో పాటు జగతి బయటకు వస్తుంది.
ఇంత మంచి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరు అంటూ జగతి పాండియన్ అడగగా పాండియన్ మాత్రం రిషి పేరు చెప్పడు అయినా నాకు తెలుసు రిషికి థాంక్స్ చెప్పండి అంటూ జగతి సంతోషపడుతుంది. ఏంజెల్ విశ్వనాథం దగ్గరికి వెళ్ళగా పెళ్లి గురించి ఏం ఆలోచించావు అని అడగడంతో ఏంజెల్ మాట్లాడుతూ నాకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పు విశ్వం అని అడగగా ఆయన చెబుతూ ఉంటారు. అయితే ఈ లక్షణాలన్నీ కూడా రిషిలో ఉన్నాయి అంటూ ఏంజెల్ రిషి గురించి ఆలోచనలో పడుతుంది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!