Guppedantha Manasu: రిషి పై మరోసారి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్న శైలేంద్ర!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…విశ్వనాథం కాలేజ్ స్టాప్ తో మీటింగ్ పెట్టుకొని మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంటారు. అంతలోపే రిషి వసుధార అక్కడికి రావడంతో మహేంద్ర జగతి మేడం వాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మన కాలేజ్ వారికి అప్ప చెబుతున్నారు. ఆ ప్రాజెక్ట్ మీరు టేక్ ఓవర్ చేయాలి అని రిషి వసుధారకు చెబుతారు.

అది విని ఒక్కసారిగా షాక్ అవుతారు అయితే వసుధార మాత్రం ఓకే అని చెప్పగా రిషి తన వైపు కోపంగా చూస్తారు. రిషి సార్ కూడా ఓకే అనాలి కదా అనడంతో రిషి నేను డిపిఎస్టి కాలేజ్ వారితో కాస్త పర్సనల్ గా మాట్లాడాలని చెప్పి బయటకు వెళ్తారు. రిషి వెంటే వసుధార కూడా వెళ్తుంది బయటకు వెళ్లి మహేంద్ర జగతి ఉండడంతో మళ్లీ నా జీవితంలోకి ఎందుకు వచ్చారు నేను ప్రశాంతంగా ఉన్నాను లేదో చూద్దామని వచ్చారా దయచేసి నా జీవితం నుంచి వెళ్లిపోండి.

నన్ను మోసగాడు అని ముద్రవేశారు కదా.. ఈ మోసగాడితో మీకేం పని అంటూ చాలా ఘోరంగా మాట్లాడుతారు. అనంతరం జగతి మాట్లాడుతూ నేను చేసినది తప్పే దయచేసి డిబిఎస్టి కాలేజీకి తిరిగిరా రిషి అని చేతులు జోడించి బ్రతిమాలుతుంది.మా కోసం కాకపోయినా డిబిఎస్టీ కాలేజ్ కోసం తిరిగిరా కాలేజ్ వైభవం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వైభవం పూర్తిగా తగ్గిపోతుందనీ జగతి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ మాటలను పట్టించుకోకుండా రిషి వెళ్ళిపోతారు.

ఇక మహేంద్ర పిలుస్తున్నప్పటికీ రిషి ఆగడు. సార్ కి ఇంకా కోపం తగ్గలేదు ఆయన కోపం తగ్గాలి అంటే కాస్త టైం ఇవ్వాలి సర్ అని వసుధార చెబుతుంది. రిషి సార్ తప్పకుండా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు టేకప్ చేస్తారు అని వసుధార చెప్పడంతో జగతి తనని ఎమోషనల్ గా తాకడానికి వెళుతుంది. నన్ను ముట్టుకోకండి మేడం మీరు చేసిన తప్పు వల్ల మన బంధం అలాగే నా బంధం కూడా తెగిపోయింది. నా బంధం నాకు దక్కినప్పుడే మన బంధం కలుస్తుందని వెళ్ళిపోతుంది.

ఇక మహేంద్ర జగతి ఇంటికి వెళ్లడంతో విశ్వం రిషి ఒప్పుకున్నారా అని అడుగుతారు లేదని మహేంద్ర సమాధానం చెబుతారు. ఇలాంటి విషయాల్లో చాలా ముందుండే రిషి ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కాలేదని విశ్వనాథం చెప్పడంతో రెండు రోజులు సమయం ఇవ్వమన్నారని చెబుతారు.మరోవైపు శైలేంద్ర రిషి బ్రతికి ఉండడం చూసి తనని ఎలాగైనా చంపేయాలని తనపై మరొక అటాక్ చేయించడానికి సిద్ధమవుతారు.

ఎప్పటికైనా డిబిఎస్టి కాలేజ్ నా చేతులలోకి వస్తుంది అనుకున్నాను కానీ రిషి బ్రతికుంటే అది జరగదు ఇక సమరం మొదలు పెట్టాల్సిందేనని మరొక ప్లాన్ చేస్తారు. ఇక మహేంద్ర మనం వెళ్లిపోవాలి అని చెప్పడంతో నేను నా కొడుకుని వదిలి రాను మహేంద్ర ఇక్కడే ఉంటానని జగతి మాట్లాడుతుంది.నా కొడుకు నన్ను అసహ్యించుకున్న నన్ను అమ్మ అని పిలిచారు. నాకు పదేపదే అదే గుర్తుకు వస్తుంది అంటూ కొడుకుని తలుచుకొని జగతి ఎమోషనల్ అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus