Jai Balayya Song: ఊపు ఊపుతున్న ‘వీర సింహా రెడ్డి’ ‘జై బాలయ్య’ సాంగ్..!

నటసింహ నందమూరి బాలకృష్ణ వీరాభిమానులు ఎంతో ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది.. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ‘వీర సింహా రెడ్డి’ మ్యూజిక్ ఫెస్ట్ స్టార్ట్ అయిపోయింది. బాలయ్య అనే పదంతో, జై బాలయ్య అనే నినాదంతో అభిమానులకి అవినాభావ సంబంధం ఉంది.. జై బాలయ్య అంటే కేవలం స్లోగన్ మాత్రమే కాదు మా ఎమోషన్ అంటారు ఫ్యాన్స్.. అలాగే అభిమానులు అందరికీ ఉంటారు.. మా బాలయ్య బాబుకి మాత్రం భక్తులు ఉంటారు అంటుంటారు..

క్రికెట్ స్టేడియం, పబ్, మాల్, కాలేజ్, స్కూల్.. అంతెందుకు..అనకాపల్లి నుండి ఆస్ట్రేలియా వరకు ప్లేస్ ఏదైనా బాలయ్య బేస్ ఉండాల్సిందే అంటారు. ఇప్పుడు వాళ్ల ఆనందం రెట్టింపయ్యేలా.. ‘వీర సింహా రెడ్డి’ నుండి మాస్ ఆంథెమ్ వచ్చేసింది. బాలయ్య, గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబోలో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. శృతి హాసన్ హీరోయిన్..

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. నవంబర్ ఉదయం 10:29 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్‌కి, సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.. కరీముల్లా చాలా చక్కగా పాడారు.. ‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నించుని మొక్కుతారు.. తిప్పు సామీ కోర మీసం.. తిప్పు సామీ ఊరి కోసం.. నమ్ముకున్న వారి కోసం.. అగ్గిమంటే నీ ఆవేశం..

నిన్ను తాకే దమ్మున్నోడు లేడే లేడయ్యా.. ఆ మెలతాడు కట్టిన మొగోడింకా పుట్టనేలేదయ్యా.. జై బాలయ్య.. జై జై బాలయ్య’’ అంటూ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ సాగే పదాలు ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చేలా, అసలు సిసలు మాస్ జాతర అనేలా ఉంది మాస్ ఆంథెమ్.. పాటలో కనిపించి థమన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వచ్చే సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాడు..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus