2023 సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తో రజనీకాంత్ కు పూర్వ వైభవం వచ్చింది. మేకర్స్ కు ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించింది. అయితే జైలర్ నటుడు రెడిన్ కింగ్ స్టీ 46 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నటుడు బుల్లితెర నటి సంగీతను వివాహం చేసుకున్నారు.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్ గా ఈ వివాహ వేడుక జరిగింది. ఈ జంట పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా జోడీ బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన కోలమావు కోకిల సినిమాతో రెడిన్ కింగ్ స్టీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ తో రెడిన్ కింగ్ స్టీ ఆకట్టుకుంటున్నారు.
నెల్సన్ సినిమాలలో వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటున్న ఈ నటుడు సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటున్నారు. నెల్సన్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కూడా ఈ నటుడికి ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. రెడిన్ కింగ్ స్టీ పారితోషికం కూడా పరిమితంగా ఉందని తెలుస్తోంది. రెడిన్ ఇతర భాషలపై కూడా దృష్టి పెడితే కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంది.
జైలర్ సక్సెస్ తో నెల్సన్ రేంజ్ కూడా పెరిగింది. కథ, కథనం విషయంలో కొత్తదనం చూపిస్తే సక్సెస్ సొంతమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమా సక్సెస్ తో నెల్సన్ కు ఛాన్స్ ఇవ్వడానికి చాలామంది హీరోలు ఆసక్తి చూపుతున్నారు. విజయ్ నెల్సన్ కాంబోలో ఒక సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రెడిన్ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!