రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ మూవీకి భాషతో సంబంధం లేకుండా పాజిటివ్ టాక్ వచ్చింది. కావాలయ్యా పాట హిట్ కావడం, ట్రైలర్ బాగుండటంతో జైలర్ పై అంచనాలు పెరగగా ఈ సినిమా రిజల్ట్ విషయంలో రజనీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.
జైలర్ (Jailer) ఓటీటీ స్ట్రీమింగ్ విషయానికి వస్తే సన్ నెక్స్ట్ ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇతర ఓటీటీలతో పోల్చి చూస్తే సన్ నెక్స్ట్ కు ఆదరణ తక్కువగా ఉంది. ఈ ఓటీటీలో జైలర్ సినిమాను రిలీజ్ చేస్తే ఓటీటీలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం సులువు కాదు. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబర్ చివరి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జైలర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. రజనీకాంత్ ఈ సినిమాలోని తన రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ చిన్న పాత్రల్లో కనిపించినా తన పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. జైలర్ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
నెల్సన్ కు ఈ సినిమాతో మరో భారీ సక్సెస్ దక్కడంతో ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. త్వరలో రజనీకాంత్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రజనీని అభిమనించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.