Tamannaah: అలాంటి రోల్ చేయడమే తమన్నాకు శాపమైందా.. ఏం జరిగిందంటే?

రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జైలర్ మూవీ బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో కలెక్షన్లను సాధించి ఓటీటీలో సైతం సంచలన రికార్డులను సొంతం చేసుకుంది. ఏడు పదుల వయస్సులో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ రజనీకాంత్ సత్తా చాటుతున్నారు. అయితే జైలర్ సినిమాకు పని చేసిన అందరికీ వేర్వేరు బహుమతులు దక్కాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన తమన్నాకు మాత్రం ఎలాంటి గిఫ్ట్ దక్కకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.

పెద్దగా ప్రాధాన్యత లేని రోల్ లో నటించడమే తమన్నా పాలిట శాపమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించి ఉంటే మాత్రం తమన్నాకు కు ఖరీదైన బహుమతి దక్కి ఉండేదని ఈ సినిమా మరిన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఉండేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమన్నా ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో, మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. కథల ఎంపికలో పాత్రల ఎంపికలో తమన్నా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

తమన్నా (Tamannaah) పెళ్లికి సంబంధించిన తీపికబురును ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో తమన్న మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. తమన్నా రెమ్యునరేషన్ ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే తమన్నా రేంజ్ మరింత పెరగడంతో పాటు ఇతర భాషల్లో కూడా ఆఫర్లు పెరుగుతాయి.

బోల్డ్ రోల్స్ లో నటించడానికి తమన్నా దూరంగా ఉంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ విషయంలో తమన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు తమన్నా విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడం గమనార్హం. తమన్నాకు వచ్చే ఏడాది కూడా కలిసిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus