రజినీకాంత్ హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ ‘జైలర్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. తెలుగులో ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే రూ. 600 కోట్లు వసూల్ చేసిందని చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజినీకాంత్ తన ఏజ్ కి, ఇమేజ్ కి తగ్గ పాత్రని పోషించారు అని చెప్పాలి.
ఇక ఈ చిత్రంలో హైలెట్స్ చాలానే ఉన్నప్పటికీ.. మెయిన్ గా విలన్ గురించి కూడా చెప్పుకోవాలి. అతని లుక్స్ తో, పెర్ఫార్మన్స్ తో అందరినీ భయపెట్టాడతను. మలయాళం సినిమాలు చూసేవారికి ఇతన్ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇతని పూర్తి పేరు టి.కె.వినాయకన్. మొదట ఇతను ఓ డాన్సర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అటు తర్వాత దర్శకుడిగా మారి ‘తమ్పి కన్నతనం’ అనే సినిమా చేశాడు. అటు తర్వాత ఇతను చాలా సినిమాల్లో నటించాడు.
కానీ తెలుగులో కూడా ఓ సినిమాలో నటించాడు అనే సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. అవును కొంచెం గతంలోకి వెళితే.. వినాయకన్, 2006 లో వచ్చిన ‘అసాధ్యుడు’ అనే సినిమాలో నటించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ అన్నట్టు మాత్రమే ఆడింది. ఈ మూవీలో వినాయకన్ (Vinayakan) విలన్ తమ్ముడి పాత్రని పోషించాడు.