Bholaa Shankar: ‘భోళా శంకర్’.. రెండో సాంగ్ కొంచెం బెటర్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన మరో సూపర్ హిట్ రీమేక్ చిత్రం ‘భోళా శంకర్. ఆగస్టు 11న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సినిమా ఔట్పుట్ తో టీం కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ అభిమానులకి కానీ ప్రేక్షకులకి కానీ ఈ సినిమా పై నమ్మకం కనిపించడం లేదు.

అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసు. మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు ఒకటి కాగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సింగిల్ వంటి ప్రమోషనల్ స్టఫ్ అనేది హైప్ ను క్రియేట్ చేయలేకపోయింది. అయితే మొత్తానికి ఇప్పుడు సినిమాపై హైప్ పెంచడానికి మంచి స్టఫ్ ని వదిలారు ‘భోళా శంకర్’ మేకర్స్. తాజాగా ‘భోళా శంకర్’ (Bholaa Shankar) నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ‘జామ్ జామ్ జజ్జనక’ అంటూ సాగే ఈ పాట బాగానే ఉంది. సెలబ్రేషన్ సాంగ్ అంటూ దీనిని రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ లిరికల్ సాంగ్ లో చిరు డాన్స్ మూమెంట్స్, ఆయన కాస్ట్యూమ్స్ బాగున్నాయి. చిరుతో తమన్నా కూడా పోటీపడి డాన్స్ వేసినట్లు తెలుస్తుంది. కీర్తి సురేష్, సుశాంత్ ల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది అనిపిస్తుంది. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఎంతో హుషారుగా ఈ పాటని పాడారు. సంగీత దర్శకుడు మహతి సాగర్ ట్యూన్ కూడా బాగుంది. మీరు కూడా ఓసారి వినేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus