పవన్ కళ్యాణ్ పై సెటైర్లు.. తమ్మారెడ్డి పై ఓ రేంజ్లో మండిపడ్డ ‘జనసేన’ కళ్యాణ్ దిలీప్ సుంకర..!

ఇటీవల పవన్ కళ్యాణ్ గురించి టాలీవుడ్ సీనియర్ నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్లు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ‘నీ రాజకీయ లబ్ధి కోసం మీ నాన్న గారిని కూడా అల్లరి చేసేస్తున్నావ్. ఆయన పెద్ద మనిషి.. అలాంటి ఆయన.. దేవుడి దీపంతో సిగరెట్ కాల్చేవారని చెప్తున్నావ్. ఇంకోసారి పిల్లల ఫీజు కోసం దాచిన డబ్బులు పెట్టి పార్టీ బిల్డింగ్ కట్టానని దేశాన్ని ఉద్దరించడానికి చేసినట్లు చెప్తున్నావ్.మీరు చెప్పేదే నిజం అయితే.. మీకు ఉన్న మార్కెట్ ఎంత? ఒక్క సినిమా చేస్తే 50-80 కోట్లు వస్తాయి. పిల్లల ఫీజులు మహా అయితే .. ఏడాదికి 2-3 కోట్లు ఉంటాయి.

అంతకంటే ఎక్కువ ఉండవు కదా.రూ.50 కోట్ల రెమ్యూనరేషన్‌లో రూ.47 కోట్లు, రూ.80 కోట్ల రెమ్యూనరేషన్‌లో 3 కోట్లు తీసేస్తే.. మిగిలిన రూ.77 కోట్లతో బిల్డింగ్ కట్టుకోవచ్చు కదా. ఇంకేదైనా చేయొచ్చు కదా. కానీ ఏదో త్యాగం చేసేశానంటావ్.చివరికి నీ పదవుల కోసం మీ నాన్న గారిని అల్లరి చేస్తావా? ఎలక్షన్స్ కోసం సొంత తల్లిదండ్రుల్ని అల్లరి చేస్తున్నావ్. మా నాన్న కమ్యునిష్టు.. అతను కనిపిస్తే కాల్చేయండి లాంటి ఆర్డర్స్ ఉన్నాయని అంటున్నావ్. నీకు తెలియదేమో.. అలాంటి వాళ్లు ఉంటే.. ఊరి నుంచి వెలి వేసేవారు. పిలిచి కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చేవారు కాదు.

మా నాన్న గారు కమ్యూనిస్టు.. ఆయన్ని అలాగే పంపించేశారు. అల్లు రామలింగయ్య గారు ఉద్యమంలో ఉన్నారు. మీ నాన్న గురించి అయితే నాకు తెలియదు.” అంటూ తమ్మారెడ్డి.. పవన్ కు చురకలు అంటించారు. దీంతో జనసేన అడ్వకేట్ అయిన కళ్యాణ్ దిలీప్ సుంకర తమ్మారెడ్డి పై ఓ రేంజ్లో మండిపడ్డాడు. తమ్మారెడ్డి కామెంట్స్ కు కళ్యాణ్ దిలీప్ సుంకర స్పందిస్తూ.. “మీరేమైనా గొప్ప సినిమాలు తీశారా? మీరు ఎంతమంది హీరోలకు పారితోషికం ఎగ్గొట్టారో చెప్పనా? చిరంజీవి గారికి మీరు ఎంత డబ్బు ఎగ్గొట్టారో మీ ‘మా’ కి వచ్చి మాట్లాడుకుందామా?

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన తండ్రి ఎంతో కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడైనప్పటికీ రామభక్తుడు అయిపోయాడు అని చెప్పాడు. అది నీకు అర్థం కాదు. ఉస్మానియా లో ఎవరో లీడర్ ను చంపేస్తే పక్కన నేను ఉన్నాను అంటావు. ఇంకాసేపు మా నాన్న కమ్యూనిస్టు అంటావు. సినిమాలు నీకే తీయడం వచ్చు అన్నట్టు యూట్యూబ్ కి వచ్చి ఏంటేంటో మాట్లాడతావు. అన్నీ నాకే తెలుసంటావు. 2014 కి ముందు పవన్ కళ్యాణ్ తీసిన సినిమాలు ఎన్ని..

వాటికి వచ్చిన పారితోషికం ఎంత అనేది నీకు తెలీదు. ఇప్పటి సినిమాలకు తీసుకునే పారితోషికం గురించి ఏంటేంటో మాట్లాడుతున్నావు. ఇక్కడ రూ.500 కోట్లు ఉన్నా ఓ పార్టీని నడపడం చాలా కష్టం. అది నీకు తెలీదు. మొత్తం నీకే తెలుసన్నట్టు మాట్లాడతావ్.నీకు అంత అనుభవం ఉంటే.. చిన్న సినిమాలకు నీ కంట్రిబ్యూషన్ ఏమైనా అందించు” అంటూ తమ్మారెడ్డి పై ఓ రేంజ్లో మండిపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus