జనతా గ్యారేజ్ లో కథే హీరో : ఎన్టీఆర్

రేపు విడుదలకు సిద్దమైన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన జనతా గ్యారేజ్ సినిమాలో కథే హీరో అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పారు. ఈ చిత్రంలో తారక్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించారు. సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని దర్శకుడు కొరటాల శివ రాసుకున్న ఈ కథలో స్టార్లు ఎక్కడా కనిపించరని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

“జనతా గ్యారేజ్ గొప్ప కుటుంబ కథా చిత్రం. చాలా అరుదుగా ఇటువంటి కథలు దొరుకుతాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో కొత్త కథలు వస్తాయి” అని తారక్ స్పష్టం చేశారు. “ఈ మూవీలో నా పాత్ర పేరు ఆనంద్, నేచర్ లవర్ ని. భూమి మీద మొక్కలను ప్రేమించే నాకు, భూమి మీద మనుషులను ప్రేమించే వ్యక్తి పరిచయమవుతారు. ఎలా మేమిద్దరం కలుస్తాం.. కలిస్తే ఏమి జరుగుతుంది?,మేము మనుషులను, నేచర్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తాం ? అనే సంగతులు ఆసక్తికరంగా ఉంటుంది” అని కథలోని అంశాలను తెలిపారు. కొన్ని పరాజయాలు పలకరించిన తర్వాత తనలో మార్పు వచ్చిందని, దీంతో కొత్త కథలను ఎంచుకుంటున్నట్లు యంగ్ టైగర్ వివరించారు. 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus