50 రోజుల వేడుకను జరుపుకున్న గ్యారేజ్ బృందం
- October 22, 2016 / 05:21 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తిరుగులేని విజయాన్ని అందించింది. సెప్టెంబర్ 1 రిలీజ్ అయిన ఈ మూవీ అనేక రికార్డులను బద్దలు కొట్టి తారక్ సత్తాను చాటింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ మూవీ గురువారం నాటికి 50 రోజులను పూర్తి చేసుకుంది.
39 కేంద్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో గ్యారేజ్ అర్ధ శత దినోత్సవం జరుపుకున్న సందర్భంగా చిత్ర బృందం వేడుక చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన పార్టీలో ఎన్టీఆర్, కొరటాల శివ, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రతినిధులతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆకట్టుకున్న ఈ మూవీని అక్టోబర్ 23న బుల్లి తెరపై ప్రసారం చేసేందుకు మాటీవీ సిద్ధమవుతోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















