త్వరలో “పక్కా లోకల్” ప్రోమో!
- August 24, 2016 / 01:13 PM ISTByFilmy Focus
నుదుటున పెద్ద స్టిక్కర్ బొట్టు, కళ్లకు కాటుక, మెరిసే ముక్కుపుడక.. జిగేల్ మనిపించే చెవి రింగులు.. ఇవన్నీ అమ్మాయిలు ఎప్పుడో మరిచిపోయారు. వీటన్నింటిలో ఎంత అందం దాగుందో చెప్పడానికి కాజల్ అగర్వాల్ మనముందుకు వచ్చేస్తోంది. “పక్కా లోకల్” అంటూ ఐటెం సాంగ్ తో అలరించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న”జనతా గ్యారేజ్” కోసం ఈ పాటను రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హుషారుతో కంపోజ్ చేశారు. మాస్ అభిమానులను మెప్పించేలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టెప్పులు వేశారు.
ఈ పాటకు ఊర మాస్ స్టెప్పులను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేశారు. సెలెబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విన్ ప్రత్యేకంగా కాజల్ కాస్ట్యూమ్ డిజైన్ చేయడం తో ఈ పాటపై మరింత క్రేజ్ ఏర్పడింది. రీసెంట్ గా కాజల్ పోస్ట్ చేసిన ఫోటో అందరికీ నచ్చింది. ఐటెం సాంగ్ లో ఎంత అందంగా ఉంటుందో చూడాలనే కోరికను పెంచింది. అందుకే కొరటాల బృందం ఈ పాట ప్రోమో ను త్వరలో విడుదల చేయాలనీ భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్లతో నిర్మించిన జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధమయిపోయింది.
#pakkalocal coming soon.. Good luck team #JanathaGarage @tarak9999 ❤️ pic.twitter.com/jo3nk1nJEr
— Kajal Aggarwal (@MsKajalAggarwal) August 23, 2016
#Arya2 reunion at #JanathaGarage nite shoot #pakka local @alluarjun u r missing 😝 @MsKajalAggarwal @aryasukku pic.twitter.com/4BH3udhANB
— Ashwin (@ashwinmawle) August 20, 2016
















