Janhvi Kapoor: ఒక కల నెరవేరింది… ఇంకా ఇవి ఉన్నాయంటున్న జాన్వీ

బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌కి ఎన్ని కలలు ఉన్నాయ్‌! ఇదేం ప్రశ్న మనకు ఎలా తెలుస్తుంది అంటారా? అవును నిజమే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే.. మొన్నీమధ్య వరకు ఎన్టీఆర్‌తో నటించడంతో నా కల నెరవేరింది, చిరకాల కోరిక తీరింది అంటూ కామెంట్స్‌ చేసిన జాన్వీ… ఇప్పుడు తన కలల చిట్టా బయట పెట్టింది. ఆ లిస్ట్‌ చూసి వామ్మో జాన్వీ డ్రీమ్స్‌ ఇంత పెద్దవా? ఇన్నేసి ఉన్నాయా అంటూ మాట్లాడుకుంటున్నారు అభిమానులు.

అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా (Janhvi Kapoor) ఇన్‌స్టంట్‌ స్టార్‌గా బాలీవుడ్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు అయితే అందుకోలేదు. కానీ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతలో మాత్రం అదరగొడుతోంది. ర్యాంప్‌ వాక్‌లు, ఫ్రెండ్స్‌ ట్రిప్పులు అంటూ బీచ్‌లను చుట్టేస్తోంది. ఈ క్రమంలో కవ్వించే క్లిక్‌లతో కుర్రాళ్ల గుండెల్ని మెలితిప్పేస్తోంది. దీంతో జూనియర్‌ అతిలోకసుందరి టాలీవుడ్‌కి వస్తే బాగుండు అనే ఆలోచన మొదలైంది. అనుకున్నట్లే ‘దేవర’తో తెలుగులోకి వస్తోంది.

ఈ సినిమా ఓకే చేసినప్పుడు నా చిరకాల కోరిక నెరవేరింది అని చెప్పింది జాన్వీ. ఈ సినిమా కోసం చాలా రోజులుపాటు దర్శకుడిని అడిగాను అని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు తన కోరికల పూర్తి చిట్టాను బయటపెట్టింది. ఎన్టీఆర్‌తో కలిసి నటించాలన్న కోరిక ‘దేవర’ సినిమాతో నెరవేరింది… ఇక ఆ జాబితాలో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా ఉన్నాడు. రణ్‌బీర్‌తో త్వరలోనే నటించే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పింది జాన్వీ.

ఇక హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, టైగర్‌ ష్రాఫ్‌తో కలసి నటించాలని ఉందని జాబితాను పూర్తిగా ఓపెన్‌ చేసింది. అలాగే దర్శకుల విషయానికొస్తే నీరజ్‌ ఘెవాన్‌, సంజయ్‌ లీల బన్సాలీ, కరణ్‌ జోహార్‌తో కలసి పని చేయాలని ఉందని తెలిపింది. ఇక ఆమె ప్రజెంట్‌ సినిమాలు చూస్తే… రాజ్‌కుమార్‌ రావ్‌ ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’, ‘ఉలాజ్‌’ ఉన్నాయి. అలాగే విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాతో కోలీవుడ్‌లో నటిస్తుందని భోగట్టా. అలాగే రామ్‌చరణ్‌ సినిమాకు ఆమెను సంప్రదించారు అని కూడా అంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus