Janhvi Kapoor: అది భయం కాదు.. తనపై గౌరవం మాత్రమే!

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందిన సినిమాలలో నటించలేదని చెప్పాలి.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలతో బిజీగా ఉన్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తన బోల్డ్ ఫోటోలతో పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్సం పాదించుకున్నారు.

ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన తల్లి శ్రీదేవి గురించి,ఆమె నటించిన సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీ పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే తప్పకుండా వారి తల్లి లేదా తండ్రి చేసిన సినిమాలను రీమేక్ చేయాలని భావిస్తారు. శ్రీదేవి నటించిన సినిమాలలో జాన్వీ కపూర్ ఏ సినిమానైనా రీమేక్ చేస్తారా అని ప్రశ్నించగా జాన్వీ కపూర్ మాత్రం అందుకు నో అనే సమాధానం చెబుతుంది.

తల్లి నటించిన ఏ ఒక్క సినిమాని కూడా రీమేక్ చేయడానికి తాను సిద్ధంగా లేనని సమాధానం చెప్పారు. తన తల్లి నటించిన సినిమాలు రీమేక్ చేయడానికి తాను సాహసం చేయనని..అయితే భయంతో తాను వెనకడుగు వేయడం లేదని కేవలం తన తల్లికి తాను గౌరవం ఇస్తున్నాను అంటూ ఈ సందర్భంగా జాన్వీ కపూర్ తన తల్లి రీమేక్ సినిమాల గురించి కామెంట్స్ చేశారు. ఇకపోతే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు నటించిన సినిమాలో ఏవి కూడా పెద్దగా హిట్ కాలేదు

అయితే తన తల్లి శ్రీదేవి కనుక బ్రతికి ఉంటే ఈమె కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో కూడా అగ్రతారగా కొనసాగేది అంటూ కొందరు జాన్వీ కపూర్ కెరియర్ గురించి కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే శ్రీదేవి రెండవ కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus