Janhvi Kapoor: దేవర విషయంలో నా కోరిక నెరవేరింది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRRసినిమా తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో దేవర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా ద్వారా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా సౌత్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

శ్రీదేవి వారసురాలిగా ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ఇదివరకు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అక్కడే స్థిరపడ్డారు అయితే మొదటిసారి ఎన్టీఆర్ సినిమా ద్వారా ఈమె సౌత్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా దేవర సినిమా గురించి నటి జాన్వీకపూర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈమె బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి అభిమానులతో చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా ఓ అభిమాని ఈమెను (Janhvi Kapoor) దేవర సినిమా గురించి ప్రశ్నలు వేశారు. ఈమె ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఈమె ఎంతలా ఆరాట పడ్డారో అర్థమవుతుంది. ఈ సందర్భంగా జాన్వీకపూర్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను ఈ సినిమాలో హీరోయిన్గా నటించాలని కోరుకున్నాను.

ఈ సినిమా కోసం నన్ను ఎంపిక చేసుకుంటే బాగుంటుందని ఏడాది పాటు భగవంతుడిని కోరుకున్నాను. అయితే చివరికి నాకు ఆ కోరిక నెరవేరిందని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో తాను బిజీగా ఉన్నానని జాన్వీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus