బాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాలు కాకుండా కథాబలం ఉన్న సినిమాలను ఎన్నుకుంటూ నటిగా తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. రెండో సినిమాకి ఏకంగా.. బయోపిక్ కథని ఎంపిక చేసుకొని అందరికీ షాకిచ్చింది. ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంది.
అయితే ఇప్పుడు కమర్షియల్ సినిమాల వైపు దృష్టి పెడుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీకపూర్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలో నటిగా అడుగుపెట్టిన కొత్తలో చాలా మంది తనని నెపోకిడ్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా విమర్శిస్తూ కామెంట్స్ చేసేవారని.. నటన రాకుండా హీరోయిన్స్ అయిపోతారంటూ వేధించారని చెప్పింది. ఆ కామెంట్స్ తనను చాలా బాధించాయని.. కొన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది.
ఎంత బాగా నటించి మెప్పించే ప్రయత్నం చేసినా కూడా ప్రతిసారి నెపోకిడ్ అనే విమర్శలు వినిపిస్తూనే ఉండేవని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు సెలబ్రిటీలైతే.. వారి పిల్లలు నటులుగా కెరీర్ ఎంచుకోకూడదా..? అని విమర్శలు చూసినప్పుడు అనిపించేదని చెప్పుకొచ్చింది. అయితే తనపై జరిగిన ట్రోలింగ్ చూసి ప్రేక్షకులు కూడా విసిగిపోయి ఉంటారని.. ఇప్పుడు నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ మధ్యకాలంలో తను చేసిన సినిమాలన్నీ కూడా నటిగా తనకు తృప్తినిచ్చాయని.. అలానే తనలో ధైర్యాన్ని కూడా పెంచాయని చెప్పుకొచ్చింది. అందుకే ఇప్పుడు తనపై జరిగే ట్రోల్స్ ని చూసి నవ్వుకుంటానే తప్ప పట్టించుకోనని తెలిపింది. ఎంత బాగా నటించినా.. ఏదో చిన్న చిన్న లోపాలు వెతికి విమర్శించే వాళ్లు ఎప్పుడూ ఉంటారనే విషయం అర్థమైందని.. అందుకే వాటిని సీరియస్ గా తీసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!