Janhvi Kapoor: జాన్వీ కపూర్ కామెంట్ల వెనుక అర్థం ఇదేనా?

శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుతో పాటు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా జాన్వీ కపూర్ చేసిన కామెంట్లు వింటే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా తారక్ గురించి జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం నా డ్రీమ్ అని ఆమె చెప్పుకొచ్చారు.

గుడ్ లక్ జెర్రీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన జాన్వీ కపూర్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లకు జోడీగా నటించే అవకాశం లేదని వెల్లడించారు. నా వయస్సుకు వాళ్ల వయస్సుకు మ్యాచ్ కాదని కలిసి సినిమా చేసినా ఆ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువని జాన్వీ కపూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తారక్ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు సినిమాలలో ఏదో ఒక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉంది.

జాన్వీ మాట్లాడుతూ దఢక్, గుంజన్ సక్సేనా సినిమాలు నాకు అర్హత లేకపోయినా నా దగ్గరకు వచ్చాయని నా తల్లీదండ్రుల వల్లే నాకు సినిమా ఆఫర్లు వస్తున్నాయనే అభిప్రాయం నాకు చాలాసార్లు కలిగిందని ఆమె అన్నారు. నేను నటనను ప్రేమిస్తున్నానని నటన కోసమే జీవిస్తున్నానని ఆమె తెలిపారు. నా తల్లీదండ్రుల ప్రేమకు, వాళ్ల ద్వారా నాకు అందుతున్న అవకాశాలకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం నా పనిని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు.

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో పలు సినిమాలు తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. జాన్వీ ఇప్పటికే తారక్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని అందుకే ఈ విధంగా కామెంట్లు చేసిందని జాన్వీ కామెంట్ల వెనుక అర్థం ఇదేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus