Janhvi Kapoor: రూ.35 కోట్లు విలువ గల తన ఇంటిని అమ్మేసిన జాన్వీ కపూర్..!

దివంగత స్టార్ హీరోయిన్, అందానికి కేరాఫ్ అడ్రస్ మరియు అతిలోక సుందరిగా పిలువబడిన శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ‘ధడక్’ తో హీరోయిన్ గా పరిచయమైన జాన్వీ.. డెబ్యూ మూవీతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తర్వాత ‘గుంజన్ సక్సేనా’ బయోపిక్ మరియు ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలు ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు జాన్వీ చాలా కష్టపడుతుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా జాన్వీ తన ఇల్లు అమ్మేసిందంటూ బి- టౌన్లో గట్టిగా ప్రచారం జరుగుతుంది. జాన్వీకి జూహులో ఉన్న ఓ అపార్టుమెంట్‌లో ఓ విలువైన ప్లాట్ ఉంది. ఈ ప్లాట్‌ను భారీ ధరకు ఓ స్టార్‌ నటుడికి అమ్మినట్లు వార్తలు ప్రచారం జరుగుతుంది.జూహు-విల్లె పార్లీ అనే అపార్ట్‌మెంట్‌లో 14, 15, 16 అంతస్థుల్లో ఓ లగ్జరీ ప్లాట్‌ను నిర్మించుకుంది జాన్వీ. దీని విలువ రూ.35 కోట్లని వినికిడి. ఆమె ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఈ ప్లాట్ ను ప్రముఖ నటుడు రాజ్‌ కుమార్‌ రావుకి రూ. 45 కోట్ల అమ్మినట్టు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.

జాన్వీతో పాటు ఆమె సోదరుడు అర్జున్‌ కపూర్‌ సైతం తన ఇల్లును అమ్మినట్లు ప్రచారం జరుగుతుంది. ఇది పక్కన పెడితే.. రాజ్‌కుమార్‌ రావు, తన ప్రియురాలు పత్రలేఖను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కలిసి ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో జాన్వీని సంప్రదించాడని స్పష్టమవుతుంది.

ఆ టైంకి జాన్వీ కూడా తన ప్లాట్ ను అమ్మాలని చూసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫ్లాట్ల కొనుగోలు చేసిన తర్వాత పార్కింగ్ స్పేస్ కోసం ఏకంగా రూ. 2.19 కోట్లు ఖర్చు చేశాడట రాజ్ కుమార్ రావు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus